Begin typing your search above and press return to search.

శర్వానంద్ మామూలు 'రిచ్' కాదన్నమాట!

By:  Tupaki Desk   |   14 Sep 2022 2:30 AM GMT
శర్వానంద్ మామూలు రిచ్ కాదన్నమాట!
X
కొంతమంది హీరోలు చాలా సింపుల్ గా ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఒక విధంగా అలాంటి వారిని చూస్తే మాత్రం వీరికి పెద్దగా ఆస్తులు ఏమీ ఉండవు అని కూడా అనుకుంటూ ఉంటారు. ఇక ఆ తరహాలో చాలా కూల్ గా కనిపించే యువ హీరోలలో శర్వానంద్ ఒకరు. నిజానికి శర్వానంద్ బ్యాక్ గ్రౌండ్ గురించి బయట జనాలకు పెద్దగా తెలియదు. అతను కూడా ఎప్పుడు గొప్పలు చెప్పుకోలేదు.. చూపించుకోలేదు కూడా.

సింపుల్ గా ఉండేందుకు ఈ హీరో ఇష్టపడతాడు. ఒక విధంగా చెప్పాలి అంటే మహానుభావుడు సినిమా వరకు కూడా శర్వా కేవలం ఒక కీప్యాడ్ ఫోన్ మాత్రమే వాడుకుంటూ ఉండేవారట. ఆ తర్వాత ఫ్యాన్స్ కు అలాగే జనాలకు దగ్గరగా ఉండాలి అని స్మార్ట్ ఫోన్ తీసుకొని సోషల్ మీడియా లోకి వచ్చాడు. అది కూడా కేవలం తన సినిమాలకు సంబంధించిన హడావిడి ఉంటేనే సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాడు.

ఇక శర్వానంద్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఒక విషయం మాత్రం క్లారిటీగా అర్థమైంది. అతను మాత్రం మామూలు సంపన్నుడు కాదు అని చాలా క్లారిటీగానే చెప్పేసాడు. శర్వానంద్ గత ఆరు సినిమాలు ఫ్లాప్ కావడంతో అతను రెమ్యునరేషన్ కోసం ఆశపడి ఓకే చేస్తున్నాడా అనే టాక్ వచ్చింది. అయితే అలా అనుకుంటే.. డబ్బు కోసమే సినిమాలు చేయాలి అంటే తనకు అంత అవసరం లేదు అని కుండబద్దలు కొట్టేశాడు. అవసరమైతే తానే సినిమా నిర్మించుకునేంత ఉందని కూడా అన్నాడు.

అలాగని ఎప్పుడూ కూడా తాను తన తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిపై మాత్రం ఆధారపడలేదు అని కూడా అన్నాడు. అయితే ఆ ఇంటర్వ్యూలో మాత్రం హైదరాబాదులో ఉండే పావు వంతు ఫ్లాట్లు బిట్లు శర్వానంద్ వాళ్ళవే అని ఒక దర్శకుడు చెప్పినట్లుగా ప్రశ్న ఎదురయింది. మరి అంత లేదు కానీ నా పేరెంట్స్ మాత్రం పరవాలేదు అనే విధంగానే సంపాదించారు అని అన్నాడు.

ఇక శర్వానంద్ చెప్పిన దాన్ని బట్టి అయితే అతనికి వందల కోట్లకు పైగా ఆస్తులు ఉంటాయని అనిపిస్తోంది. ఇక అతను రాంచరణ్ రానా దగ్గుపాటి చదువుకున్న స్కూల్స్ లోనే చదువుకున్నాడు. చిన్నప్పటినుంచి కూడా మెగా ఫ్యామిలీకి అతనికి మంచి అనుబంధం ఉంది. రామ్ చరణ్ క్లోజ్ ఫ్రెండ్ కూడా. ఇక మా అన్నయ్య వ్యాపారాలు కొనసాగిస్తున్నాడు అని చెప్పిన శర్వా.. ఇప్పుడైతే తన కష్టంతోనే సినిమాలు చేసుకుంటూ తన డబ్బుతోనే జీవిస్తున్నానని చెప్పాడు. ఇక ప్రత్యేకంగా ఎప్పుడైనా ఖాళీ సమయం దొరుకుతే సొంతంగా కొనుక్కున్న ఫామ్ హౌస్ కి వెళ్లి అక్కడ ప్రశాంతంగా ఉంటాను అని కూడా తెలియజేశాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.