Begin typing your search above and press return to search.
శర్వా క్యూలో రెండు.. ఎవరితో ముందు?
By: Tupaki Desk | 1 Jun 2020 12:15 PM ISTహీరో శర్వానంద్ కెరీర్ మొట్ట మొదటి సోలో బ్లాక్ బస్టర్ హిట్ `రన్ రాజా రన్`. ఈ సినిమాని ఇచ్చింది యు.వి.క్రియేషన్స్. అంతకుముందు శర్వాకి సక్సెస్ లు ఉన్నా కానీ.. రన్ రాజా రన్ తో హిట్టు కొట్టాకే మైలేజ్ పెరిగింది. రన్ రాజా రన్- శతమానం భవతి లాంటి చిత్రాలు మార్కెట్ పరంగానూ ఇమేజ్ పెంచాయి.
ఇక `రన్ రాజా రన్` చిత్రాన్ని తనకు ఇచ్చిన యువి క్రియేషన్స్ అంటే శర్వాకి ఎంతో అభిమానం. అదే బ్యానర్ లో ఎక్స్ ప్రెస్ రాజా - మహనుభావుడు అనే చిత్రాల్లోనూ నటించాడు. ఎక్స్ ప్రెస్ రాజా ఆశించినంత విజయం సాధించకపోయినా మహానుభావుడు చిత్రం ఫర్వాలేదనిపించింది. యువి బ్యానర్ అంటే తన హోమ్ బ్యానర్ అని చెప్పే శర్వానంద్ తాజాగా మరో ప్రాజెక్టుకి కమిటయ్యాడు.
ఇటీవల వరుసగా ఫ్లాపులు అందుకుంటున్న శర్వాకి మరోసారి లిఫ్ట్ ఇచ్చేందుకు యువి బృందం సిద్ధమవుతోంది. ఇటీవలే శ్రీరామ్ అనే కొత్త తరం దర్శకుడు వినిపించిన స్క్రిప్ట్ శర్వాకి పిచ్చిగా నచ్చేసిందట. యువి క్రియేషన్స్ అధినేతలు ప్రమోద్ - వంశీ అతడిని లాక్ చేశారు. మీడియం బడ్జెట్ తో అక్టోబర్ లో సినిమాని ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారని తెలిసింది. ఇటీవలే ప్రతి రోజూ పండగే చిత్రంతో హిట్ కొట్టినా కానీ యువీకి ప్రభాస్ 20 (ఓ డియర్) మూవీ పెద్ద సవాల్ గానే మారింది. లాక్ డౌన్ వల్ల షూటింగ్ వాయిదా పడడం ఇబ్బందికరంగా మారింది. ఈ సినిమాతో పాటు ప్యారలల్ గా ఇతర సినిమాలకు ప్లాన్ చేయాల్సి ఉన్నా అంతకంతకు ఆలస్యమవుతోంది.
2020లో శర్వాతో సినిమా సహా రామ్ - మారుతి కాంబో మూవీని పట్టాలెక్కించే ప్లాన్ లో ఉంది యువి సంస్థ. ఇక శర్వానంద్ కమిట్ మెంట్ల సంగతి చూస్తే అతడు ఇప్పటికే ఆర్.ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతికి కమిటయ్యాడు. అనీల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అటు ఏకే బ్యానర్ కి ఇటు యువి క్రియేషన్స్ కి అతడు డేట్లు సర్ధుబాటు చేయాల్సి ఉంటుందట.