Begin typing your search above and press return to search.
లవకుశ అండ్ స్పైడర్ తో పోటీనా?
By: Tupaki Desk | 16 Aug 2017 6:00 AM GMTఈ దసరాకు మన సినిమా అభిమానులుకు నిజంగానే పండుగ వచ్చిందినే చెప్పాలి. క్రేజీ కథతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ తో వస్తుంటే సూపర్ స్టార్ మహేశ్ బాబు బలమైన కథతో స్టైలిష్ స్పై గా ‘స్పైడర్’ తో వస్తున్నాడు. ఈ సినిమాలు కోసం మన తెలుగు సినీ సగటు ప్రేక్షకల కళ్ళు ఆకలితో ఎదురుచూస్తున్నాయి. ఇప్పుడు ఈ రెండు కాకుండా మరో సినిమా ఈ రెండింటి వెనకాల వచ్చేసి పోటీపడుతుందట.
జై లవ కుశ సినిమా సెప్టెంబర్ 21న వస్తే స్పైడర్ సినిమా సెప్టెంబర్ 27 న విడుదలవుతుంది. అయితే ఇప్పుడు మరో యంగ్ శర్వానంద్ హీరోగా నటించిన మారుతీ డైరెక్ట్ చేసిన ‘మహానుభావుడు’ సినిమా సెప్టెంబర్ 29 న విడుదల చేయడానికి అన్నీ ఏర్పాట్లు చేసేశారు. సెప్టెంబర్ 29 న వరుసుగా రెండు రోజులు సెలవులు ఉండటంతో ఎటువంటి సమస్య రాదనే ఆశతో విడుదల చేస్తున్నారు మహానుభావుడు టీమ్. ఇలాగే సంక్రాంతికి వచ్చిన శర్వానంద్ హీరోగా నటించిన ‘శతమానం భవతి’ రెండు పెద్ద సినిమాలతో కలిసి వచ్చి మంచి విజయాన్ని దక్కించుకుంది. అంటే ఇప్పుడు కూడా అలానే మంచి టాక్ వస్తే ఈ సినిమా పరిస్థితి పర్వాలేదు. కానీ ఏమైనా నెగిటివ్ టాక్ వస్తే మాత్రం ఘోరంగా దెబ్బ తినే ప్రమాదం ఉంది.
అయితే ఈ సినిమా నిర్మాణ సంస్థ అయన యువి క్రియేషన్స్ వాళ్ళు మారుతీ కథ పై మంచి నమ్మకం పెట్టుకున్నారు. మారుతీ డైరక్షన్ మీద నమ్మకంతో విడుదల చేస్తున్నాం అని చెబుతున్నారు. అయితే ఈ మహానుభావుడుకి థియేటర్లు దొరకవు అనే సమస్య ఉన్నట్లు కనిపించటం లేదు. ఎందుకంటే యువి క్రియేషన్స్ వాళ్ళకి సొంతంగా కొన్ని డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఉన్నాయి. కాబట్టి రెండు పెద్ద సినిమాలు వచ్చినా మహానుభావుడు సినిమాకు థియేటర్లు ఖచ్చితంగా ఉన్నట్లేనట. అయితే ఇప్పుడు ట్రేడ్ వర్గాలు అనుమానం ఏంటి అంటే ఆ ఇద్దరి మధ్య ఈ కుర్రాడు ఎలా నెట్టుకువస్తాడో ఏమి అవుతాడో చెప్పలేం అంటున్నారు.