Begin typing your search above and press return to search.

మహానుభావుడు ఎక్కడున్నాడు..

By:  Tupaki Desk   |   10 Oct 2017 9:27 AM GMT
మహానుభావుడు ఎక్కడున్నాడు..
X
దసరా సీజన్లో ‘జై లవకుశ’.. ‘స్పైడర్’ లాంటి భారీ సినిమాలతో పోటీ పడి బాక్సాఫీస్ విజేతగా నిలిచింది ‘మహానుభావుడు’. తొలి వీకెండ్లో ఈ సినిమా అంచనాల్ని మించి వసూళ్లు సాధించింది. ‘జై లవకుశ’.. ‘స్పైడర్’ దీని ముందు నిలవలేకపోయాయి. తొలి వారంలోనే రూ.17 కోట్లకు పైగా షేర్ రాబట్టి శర్వా కెరీర్లో ఫస్ట్ వీక్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది ‘మహానుభావుడు’. ఐతే గత వీకెండ్లో కొత్తగా చెప్పుకోదగ్గ సినిమాలేమీ లేకపోయినా.. ‘జై లవకుశ’.. ‘స్పైడర్’ నామమాత్రంగా నడుస్తున్నా.. అడ్వాంటేజ్ తీసుకోలేకపోయింది ‘మహానుభావుడు’. అన్నీ కలిసొచ్చిన తరుణంలో ఈజీగా ఓ 5 కోట్లయినా షేర్ రాబడుతుందనుకుంటే.. వరల్డ్ వైడ్ మూడు కోట్లకు పైచిలుకు షేర్ మాత్రమే రాబట్టిందా సినిమా.

ఓవరాల్ గా ఇప్పుడు ‘మహానుభావుడు’ రూ.20 కోట్ల షేర్ మార్కును దాటింది. రూ.20.5 కోట్ల దగ్గర ‘మహానుభావుడు’ నిలిచి ఉంది. ఓవర్సీస్‌ లో తొలి వీకెండ్లోనే హాఫ్ మిలియన్ మార్కును దాటిన ‘మహానుభావుడు’ ఆ తర్వాత ఆశించిన మేర వసూళ్లు రాబట్టలేకపోయింది. మిలియన్ డాలర్లు గ్యారెంటీ అనుకుంటే ఇంకా.. 7.5 లక్షల డాలర్ల దగ్గరే ఉందా సినిమా. పాజిటివ్ టాక్ తెచ్చుకుని.. పోటీలో ఉన్న సినిమాలు డల్లయిన సమయంలో ‘మహానుభావుడు’ ఇలాంటి వసూళ్లు సాధించడం ఆశ్చర్యమే. తీవ్ర పోటీ మధ్య కూడా శర్వానంద్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ‘శతమానం భవతి’ దరిదాపుల్లోకి కూడా ‘మహానుభావుడు’ అందుకునే అవకాశాలు లేవని తేలిపోయింది. ఆ చిత్రం ఫుల్ రన్లో రూ.35 కోట్ల దాకా షేర్ సాధించడం విశేషం.