Begin typing your search above and press return to search.

కథ మీద నమ్మకంతోనే వస్తున్నారట

By:  Tupaki Desk   |   17 Aug 2017 3:31 PM IST
కథ మీద నమ్మకంతోనే వస్తున్నారట
X
శతమానం భవతి సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న శర్వానంద్ ఆ తర్వాత వచ్చిన రాధా సినిమాతో కాస్త నిరాశపరిచాడు. అయితే జయాపజయాలు సినీ లైఫ్ లో కామన్ అనుకోని ఈ హీరో ఏ మాత్రం ఆగకుండా చక చక సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. అంతే కాకుండా పండగలనే టార్గెట్ చేస్తూ బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకుంటున్నాడు.

ప్రస్తుతం శర్వానంద్ మారుతి డైరెక్షన్స్ "మాహానుభావుడు" సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా కూడా దాదాపు అంత అయిపోవచ్చింది. ఒక్క పాట చిత్రీకరణతో పాటు కేవలం డబ్బింగ్ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయట. ఇక మారుతీ "బలే బలే మగాడివోయ్" సినిమా తరహాలో ఉండే ఒక ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ ను తెరకెక్కిస్తున్నానడట.మారుతీ - శర్వానంద్ కాంబినేషన్ తో మరో హిట్ కొట్టాలనుకుంటున్నారు యువీ నిర్మాతలు. దసరా కానుకగా స్పైడర్ వస్తున్నా కూడా.. కథ మీద నమ్మకంతో మహేష్ సినిమాకు పోటీగా మహానుభావుడు రాబోతున్నాడట. ముందు ఆగస్టు 24న ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి తమ సత్తా చూపిస్తాం అంటున్నారు.

నిజానికి చిత్రాన్ని నిర్మిస్తున్న యువి సంస్థ లో ఈ చిత్ర దర్శకుడు-హీరో ఇంతకుముందు ఓ సినిమాను చేసినవారే. శర్వా - మేర్లపాక గాంధీ కాంబినేషన్ లో వచ్చిన ఎక్స్ ప్రెస్ రాజా మంచి హిట్ అయ్యింది. అలాగే నాని-మారుతీ కాంబో లో వచ్చిన బీబీఎం ఏ స్థాయిలో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగని చెప్పి మరీ స్పైడర్ తో పోటీవస్తానంటే ఎలా అని చాలా సందేహాలున్నాయి ట్రేడ్ వర్గాలకు. అవన్నీ ఫస్ట్ లుక్ తో క్లియర్ చేస్తాం అంటున్నారు. చూద్దాం ఏమవుతుందో.. ఈ లుక్ ఎలా ఉండబోతుందో!!