Begin typing your search above and press return to search.
శర్వా మార్కెట్ డౌన్ అయ్యిందా?
By: Tupaki Desk | 1 March 2019 3:30 PM GMTవెర్సటైల్ స్టార్ శర్వానంద్ హీరోగా కెరీర్ ప్రారంభించి దశాబ్ధం పైగానే అయ్యింది. నటించిన వాటిలో డీసెంట్ హిట్స్ ఉన్నాయి. చక్కని నటుడు అన్న గుర్తింపు తనకు ఉంది. కెరీర్ లో రన్ రాజా రన్, శతమానం భవతి లాంటి బ్లాక్ బస్టర్లు ఉన్నాయి. మహానుభావుడు యావరేజ్ గా ఆడినా అతడిపై సాఫ్ట్ కార్నర్ ఉంది. కొత్తదనంతో పాటు కంటెంట్ కోసం ప్రయత్నిస్తూ ప్రయోగాలు చేసిన ఈ యువహీరోకి ఫ్యామిలీ ఆడియెన్ లో గ్రిప్ ఉంది. అయితే ఇక్కడ ఫేట్ ని నిర్ణయించేది హిట్టు మాత్రమే. సక్సెస్ ఒక్కటే గీటురాయి. అది లేకపోతే ఎంతటి హీరోకి అయినా టైమ్ బ్యాడ్ అయినట్టే.
ప్రస్తుతం శర్వానంద్ కి అలాంటి చిక్కు తప్పడం లేదని తెలుస్తోంది. శర్వానంద్ ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో నటిస్తున్నాడు. మాఫియా, గ్యాంగ్ స్టర్ కథాంశం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శర్వా డాన్ పాత్రలో కనిపించనున్నాడు. కమల్ హాసన్ `నాయకుడు` రేంజు పాత్రలో నటిస్తున్నాడని ప్రచారం సాగుతోంది. అతడి సరసన అందాల చందమామ కాజల్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ ఎలా ఉంది? అన్న ప్రశ్న వేస్తే మాత్రం ఏమంత బాలేదన్న మాటా మార్కెట్ వర్గాల్లో వినిపిస్తోందట.
శర్వానంద్ - సాయి పల్లవి జంటగా హను రాఘవపూడి తెరకెక్కించిన `పడి పడి లేచే మనసు` డిజాస్టర్ అవ్వడం అతడికి అన్ని రకాలుగా మైనస్ అయ్యింది. సెంటిమెంట్ పరిశ్రమలో ఫ్లాప్ ఏమాత్రం కలిసి రాదు కాబట్టి ఆ ప్రభావం ప్రస్తుత సినిమాపై పడిందని తెలుస్తోంది. ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ విషయమై మార్కెట్ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి. అయితే నిర్మాత డిమాండ్ చేసినంత ఇచ్చేందుకు కొనేవాళ్లు సిద్ధంగా లేకపోవడంతో బిజినెస్ పరంగా ఇబ్బంది తప్పడం లేదని తెలుస్తోంది. కెరీర్ డౌన్ లో ఉన్నప్పుడు పట్టు విడుపు తప్పదు. పాము - నిచ్చెన ఆటలో ఎవరికైనా ఇది సహజమే. ఈ సినిమా రిలీజై హిట్టొస్తే శర్వానంద్ మార్కెట్ రేంజు మళ్లీ పెరుగుతుంది. అప్పటివరకూ కాస్త ఓపిగ్గా వేచి చూడాల్సిందే. అంతకంటే ముందే ట్రేడ్ తనని నమ్మి ఈ సినిమా సజావుగా వెళ్లేందుకు సాయపడుతుందేమో చూడాలి. తదుపరి శర్వానంద్ - సమంత జంటగా 96 రీమేక్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.