Begin typing your search above and press return to search.

యంగ్ హీరో ఎందుకిలా విఫ‌లం అవుతున్నారు?

By:  Tupaki Desk   |   1 Feb 2022 6:00 AM IST
యంగ్ హీరో ఎందుకిలా విఫ‌లం అవుతున్నారు?
X
టాలీవుడ్ లో హిట్టు వుంటేనే విలువ‌.. అది చేయి జారిందో దాన్ని అందిపుచ్చుకోవ‌డానికి ఇక్క‌డ‌ పాట్లు ప‌డాల్సిందే. ఇప్పుడు మ‌న‌ టాలీవుడ్ హీరో శ‌ర్వానంద్ అదే చేస్తున్నారు. గ‌త కొంత కాలంగా ఆయ‌న ఏది ప‌ట్టుకున్నా భ‌గ్గు మంటోంది. ఎన్ని ప్ర‌యోగాలు చేసినా పెద్ద‌గా ఫ‌లించ‌డం లేదు. ఆయ‌న హిట్టు మాట విని దాదాపు నాలుగేళ్ల‌వుతోంది. `మ‌హాను భావుడు` త‌రువాత ఆయ‌న హిట్టుమాట విన లేదు. న‌టుడిగా మంచి పేరున్నా ఆయ‌న‌ని స‌క్సెస్ లు మాత్రం వ‌రించ‌డం లేదు.

అయన కొత్త బాట ప‌ట్టాస్తాయ‌ని అంగీక‌రించిన చిత్రాలు చాలా వ‌ర‌కు వరుస‌గా శ‌ర్వాకు ఫ్లాపుల్ని అందించాయి. రీసెంట్ గా చేసిన `మహా స‌ముద్రం` కూడా ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌లేక‌పోయింది. దీంతో శ‌ర్వా ఖాతాలో మ‌రో ఫ్లాప్ చేరింది. ముందు ఈ స్క్రిప్ట్ ని కొంత మంది హీరోలు రిజెక్ట్ చేశారు. చివ‌రికి ఆ క‌థ‌కు శ‌ర్వానంద్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే.

శ‌ర్వా గ‌త కొంత కాలంగా వ‌రుస ఫ్లాపుల్ని సొంతం చేసుకుంటుండ‌టానికి ప్ర‌ధాన కార‌ణం ఆయ‌న ఎంచుకుంటున్న క‌థ‌లే. స‌రైన క‌థ‌ని చూస్ చేసుకోక‌పోవ‌డంవ‌ల్లే శ‌ర్వా వ‌రుస ఫ్లాపుల‌తో వెన‌క‌బ‌డుతున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న వ‌రుస ఫ్లాపుల్పి ఎదుర్కొంటుండ‌టంతో ఆయ‌న ఫ్యాన్స్ `ప్ర‌స్థానం` లాంటి క‌థ చేస్తే చూడాల‌ని వుందంటున్నారు.

పొలిటిక‌ల్ డ్రామా అయితే శ‌ర్వాకు బాగా సూట‌వుతుంద‌ని, మంచి పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ చేస్తే బాగుంటుంద‌ని ఫ్యాన్స్ భావిస్తున్నార‌ని తెలుస్తోంది. మ‌రి శ‌ర్వా ఆలోచ‌న ఎలా వుందో చూడాలి. ప్ర‌స్తుతం శ‌ర్వానంద్ `ఆడ‌వాళ్లు మీకు జోహార్లు`, `ఒకే ఒక జీవితం` చిత్రాల్లో న‌టిస్తున్నారు. ఈ రెండూ భిన్నమైన క‌థ‌ల‌తో రూపొందుతున్నాయి. ఇంద‌లో `ఆడ‌వాళ్లు మీకు జోహార్లు` ఫిబ్ర‌వ‌రి 25న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుండ‌గా, `ఒకే ఒక జీవితం` కూడా ఫిబ్ర‌వ‌రిలోనే రిలీజ్ కు రెడీ అవుతోంది.