Begin typing your search above and press return to search.
శర్వా వరుస సర్ప్రైజ్ లు.. అస్సలు ఆగట్లేదుగా
By: Tupaki Desk | 1 Feb 2023 6:29 PM ISTటాలీవుడ్‌లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్ హీరోల్లో మొన్నటివరకు శర్వానంద్ ఒకరు. అయితే ఆయన ఓ ఇంటివాడు కాబోతున్నారనే విషయం ఇటీవల తెలిసిందే. అయితే ఈ కుర్రహీరో గత కొన్నేళ్లుగా సక్సెస్ కోసం తెగ కష్టపడుతున్నాడు. గతేడాది వచ్చిన ఓకే ఒక జీవితం సినిమాతో పర్వాలేదనిపించినా.... అది బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ పరంగా ఆశించిన స్థాయిలో సాధించలేకపోయింది. ఎన్నో ఎళ్ల తర్వాత అమల... ఈ సినిమాలో శర్వానంద్ కు తల్లిగా నటించింది. ప్రేక్షకులు సైతం ఆమె నటకు ఫిదా అయ్యారు. కానీ ఎందుకో కమర్షియల్ హిట్ అందుకోలేకపోయింది. అయినప్పటికీ ఈ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచే సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది.
ఇక ఇటీవల తను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించిన శర్వా నంద్ మరో సర్ ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పుడు ఈ కుర్ర హీరో చేతిలో రెండు కొత్త సినిమా ప్రాజెక్టులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే యువ దర్శకులతో తను చేయబోయే సినిమాల గురించి చర్చలు జరిపినట్లు సమాచారం. గతంలో డైరెక్టర్ కృష్ణ చైతన్యతో ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన శర్వానంద్... ఏమైందో తెలియదు కానీ ఆ సినిమా అనివార్య కారణాలతో ఆగిపోయింది.
ఇక దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య.. చెప్పిన కథకు శర్వానంద్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని టాక్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తోందని తెలుస్తోంది. ఈ సినిమాలో శర్వానంద్ కు జోడీగా కృతి శెట్టిని తీసుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ హీరోయిన్‌కు కూడా సరైనా హిట్స్ లేక అల్లాడిపోతుంది.
ఇక ఇంకో విషయం ఏమింటంటే... విభిన్న కథలు తెరకెక్కించే కేవీ గుహన్ తో శర్వానంద్ ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కూడా ఈ ఏడాది విడుదల చేయనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా.. శర్వానంద్ పెళ్లి ప్రకటన తర్వాత చాలా జోష్ మీద ఉన్నట్లు తెలుస్తోంది. శర్వానంద్ కు పెళ్లి తర్వాత కలిసి వస్తోందో చూడాలి ఇక.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.