Begin typing your search above and press return to search.
మళ్లీ నిర్మాతగానా.. వద్దు బాబోయ్
By: Tupaki Desk | 12 May 2017 5:06 AM GMTహీరోలు నిర్మాతలుగా మారడం మన దగ్గర కొత్తేమీ కాదు. ఐతే కెరీర్లో బాగా స్థిరపడ్డాక.. పెద్ద రేంజికి వెళ్లాకే చాలామంది నిర్మాతలుగా మారుతుంటారు. కానీ యంగ్ హీరో శర్వానంద్ మాత్రం ఇంకా పూర్తిగా నిలదొక్కుకోకముందే ‘కో అంటే కోటి’ సినిమాతో నిర్మాతగా మారాడు. అదేమీ చెత్త సినిమా కాదు. కంటెంట్ లేని మూవీ కాదు. కానీ ఎక్కడో తేడా కొట్టింది. సినిమా ఆడలేదు. శర్వా పెట్టుబడి మొత్తం బూడిదలో పోసిన పన్నీరైంది. ఆ దెబ్బతో ఇక మళ్లీ నిర్మాణం జోలికి వెళ్లలేదు శర్వా. మళ్లీ ఇప్పుడిప్పుడే నిర్మాత అవతారం ఎత్తే ఆలోచనే లేదంటున్నాడతను.
‘‘మళ్లీ నిర్మాణం జోలికి వెళ్లాలనుకోవట్లేదు. దానికి చాలా లెక్కలు తెలిసి ఉండాలని అర్థమైంది. చాలా టైం పెట్టాలి. డిస్ట్రిబ్యూషన్ వ్యవహారం తెలియాలి. సినిమా ఫలితాన్ని అంచనా వేయగలగాలి. అబ్బో చాలా ఉంటుంది. వాటన్నింటిపైనా బాగా అవగాహన వచ్చాకే చేయాలి. లేకుంటే చేయకూడదు. ఇప్పటికైతే నిర్మాతగా మళ్లీ సినిమా చేసే ఉద్దేశం లేదు’’ అని కరాఖండిగా తేల్చేశాడు శర్వా.‘రాధ’ తర్వాత చేస్తున్న.. చేయబోయే సినిమాల గురించి చెబుతూ.. ‘‘మారుతి సినిమా ఒక షెడ్యూల్ పూర్తయింది. ఆ సినిమా బాగా వస్తోంది. సుధీర్ వర్మతో సినిమా చేయాలి. ఐతే బౌండెడ్ స్క్రిప్టు రెడీ అయ్యాకే సినిమా చేస్తా. దాని వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. నిర్మాతకు చాలా బడ్జెట్ మిగులుతుంది. బౌండెడ్ స్క్రిప్టు ఉంటేనే సినిమా చేయాలని పాలసీగా పెట్టుకున్నా’’ అని శర్వా తెలిపాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/