Begin typing your search above and press return to search.

శర్వా గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా?

By:  Tupaki Desk   |   2 May 2018 12:13 PM IST
శర్వా గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా?
X
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్కరిని ఒక్కో నిక్ నేమ్ తో అభిమానులు ప్రేమగా పిలుచుకుంటారు. అలాగే ఓ వర్గం వారు స్మార్ట్ హీరో శర్వానంద్ ని కూడా ఫెస్టివల్ హీరో అని పిలుస్తున్నారు. మనోడు పండగకి వచ్చాడంటే చాలు మంచి సినిమా ఇస్తాడు అనే నమ్మకం ఆడియెన్స్ కి వచ్చేసింది. రాన్ రాజా రన్ నుంచి శర్వా కెరీర్ గ్రాస్ పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా శతమానం భవతి సినిమాతో ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గరయ్యాడు.

మహానుభావుడు సినిమా కూడా శర్వా కెరీర్ కు మంచి బూస్ట్ ఇచ్చింది. దీంతో నెక్స్ట్ సినిమాలు కూడా అదే తరహాలో మంచి హిట్ అందుకునేలా ఈ యువ హీరో ప్లాన్స్ వేసుకుంటున్నాడు. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే సుదీర్ వర్మ దర్శకత్వంలో కూడా ఒక ప్రాజెక్టును లైన్ లో పెట్టిన శర్వా దండుపాళ్యం సినిమా ద్వారా క్రేజ్ అందుకున్న శ్రీనివాస్ రాజు కథను వెయిటింగ్ లిస్ట్ లో పెట్టాడు.

భారీ బడ్జెట్ కథ కావడంతో శర్వా ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని చెప్పలేదు అని తెలుస్తోంది. అలాగని నో చెప్పే ఆలోచనలో కూడా లేడట. ప్రస్తుత షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల ఒక డిసిషన్ తీసుకోలేకపోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఆలోచించాక గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. డిఫెరెంట్ గా తెరకెక్కబోయే ఆ సినిమా హిట్ అయితే గనక శర్వా కెరీర్ లో ది బెస్ట్ చిత్రంగా నిలవడం ఖాయమని టాక్ వస్తోంది. మరి శర్వా ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.