Begin typing your search above and press return to search.

శర్వానంద్ లాజిక్ తో కొట్టాడే

By:  Tupaki Desk   |   17 Dec 2018 7:51 AM GMT
శర్వానంద్ లాజిక్ తో కొట్టాడే
X
గ్యాప్ ఎంత వచ్చినా పట్టించుకోకుండా కథ తనకు నచ్చితేనే సినిమా చేసే శర్వానంద్ ఇప్పటిదాకా చేసినవాటిలో ఒకటో రెండో మినహాయించి అన్ని విభిన్నమైన కాన్సెప్ట్స్ తో రూపొందినవే. ఈ శుక్రవారం వస్తున్న పడి పడి లేచే మనసుతో వస్తున్న శర్వా మహానుభావుడు తర్వాత ఏడాది టైం తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్ లో బిజీగా ఉన్న శర్వా మీడియా నుంచి ఎదురవుతున్న ప్రశ్నలకు చాలా లాజిక్ తో సమాధానం ఇస్తున్నాడు. వాటిలో భాగంగా నానికి హిట్ ఇచ్చిన దర్శకులను అదే పనిగా ఎంచుకుంటున్నారన్న ప్రశ్నకు తెలివిగా బదులిచ్చాడు.

భలే భలే మగాడివోయ్ తర్వాత మారుతీతో మహానుభావుడు చేసిన శర్వా ఇప్పుడు చేసిన పడి పడి లేచే మనసు దర్శకుడు హను రాఘవపూడి మొదటి సినిమా కృష్ణ గాడి వీర ప్రేమ గాధ హీరో కూడా నానినే. అయితే ఇందులో ఏ మాత్రం పాయింట్ లేదంటున్నాడు శర్వానంద్. తాను కథకే ప్రాధాన్యం ఇస్తానని ఇలా ఒకరికి సక్సెస్ ఇచ్చారు కాబట్టి మరోసారి అదే రిపీట్ అవుతుందని తాను నమ్మనని చెప్పాడు. మరి ఎక్స్ ప్రెస్ రాజాతో తనకు హిట్ ఇచ్చిన మేర్లపాక గాంధీ నానితో చేసిన కృష్ణార్జున యుద్ధం ఎందుకు ఫ్లాప్ అయ్యిందని ప్రశ్నించాడు.

నిజమే. ఈ పాయింట్ లో మీనింగ్ ఉంది. సరైన సబ్జెక్టు దొరికే వరకు ఎంత కాలమైనా వేచి చూస్తానని అంతే తప్ప వస్తున్నారు కదా అని ఏది పడితే అది ఒప్పుకునే సమస్యే లేదని చెబుతున్నాడు. ఏదైతేనేం పడి పడి లేచే మనసు మీద శర్వానంద్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఏడాదిగా సాగుతున్న అభిమానుల ఎదురుచూపులు సార్థకత చేకూరేలా ఉంది.