Begin typing your search above and press return to search.
శర్వా మెలిక పెట్టేశాడు
By: Tupaki Desk | 31 Jan 2018 4:51 AM GMTశర్వానంద్ ప్రస్తుతం చకచకా సినిమాలు చేసేస్తున్నాడు. ఏడాదికి మూడు సినిమాలను థియేటర్లలోకి తెచ్చేస్తోన్న ఊపులో ఉన్నాడు ఈ యంగ్ హీరో. గతేడాది శతమానం భవతి.. రాధ.. మహానుభావుడు అంటూ మూడు చిత్రాలను అందించిన ఈ హీరో.. ఈ ఏడాది కూడా అదే జోరు చూపించేందుకు రెడీగా ఉన్నాడు.
ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న శర్వా.. ఇప్పటికే ఓ షెడ్యూల్ కంప్లీట్ చేసేశాడు కూడా. మరోవైపు సుధీర్ వర్మ డైరెక్షన్ లో కూడా ఓ చిత్రం రూపొందుతోంది. ఈ రెండు సినిమాలను ఏకకాలంలో షూటింగ్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న శర్వా.. మరోవైపు కొత్త కథలను కూడా చకచకా వినేస్తూ.. ప్రాజెక్టు దశకు తీసుకువచ్చేస్తున్నాడు. రీసెంట్ గా దండుపాళ్యం ఫేమ్ డైరెక్టర్ శ్రీనివాస రాజు.. శర్వానంద్ ను కలిసి ఓ కథ చెప్పాడు. ఇది కూడా సీరియస్ థీమ్ తో సాగే చిత్రమే అయినా.. దండుపాళ్యం మాదిరిగా ఉండదట. ఈ స్టోరీ ని శర్వా మెచ్చినా సరే.. కేవలం బేసిక్ లైన్ మాత్రమే కావడంతో.. ఓకే చెప్పలేకపోయాడట. అయితే ఈ సినిమా ఫిబ్రవరి నెలాఖరులో మెదలెడుతున్నాం అని న్యూస్ వచ్చింది కాని.. ఇప్పుడు దీనిపై ఒక క్లారిటీ వస్తోంది.
బౌండ్ స్క్రిప్ట్ తను చదివితే మాత్రమే ఈ సినిమాపై డెసిషన్ తీసుకోగలనని.. ఈ కథను డెవలప్ చేసుకుని తీసుకురమ్మంటూ శ్రీనివాసరాజుకు మెలిక పెట్టాడట శర్వానంద్. ఇందుకోసం 3 నెలలకు పైగా టైం అడిగాడట ఆ దర్శకుడు. ప్రస్తుతం తను చేస్తున్న సినిమాలకు అంతకుమించి టైం పట్టనుండడంతో.. శర్వా కూడా ఓకే చెప్పేశాడట. మొత్తానికి ఓ కొత్త కాంబినేషన్ ను అంత ఈజీగా శర్వా ఒప్పుకోవట్లేదనమాట.