Begin typing your search above and press return to search.
శర్వాకే చిక్కలేదంటే చూస్కోండి మరి
By: Tupaki Desk | 22 March 2018 4:42 AM GMTఈ తరం సినిమా హీరోలు కేవలం యాక్టింగ్ పరిమితం అయిపోవడం లేదు. అటు సినిమా నిర్మాణంలో కొందరు భాగస్వామ్యం అవుతుంటే.. తమ సినిమాలను.. లేదంటే నచ్చిన సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసేందుకు కూడా పలువురు రెడీ అయిపోతున్నారు. శ్రీవిష్ణు మూవీ నీదీనాదీ ఒకే కథ చిత్రంపై ఇలాగే కన్నేశాడట యంగ్ హీరో శర్వానంద్.
ఈ చిత్రం టీజర్ రిలీజ్ నుంచి విపరీతమైన బజ్ నెలకొంది. డిఫరెంట్ మూవీ అనే అంశంపై అందరికీ క్లారిటీ వచ్చేయడంతో.. ట్రేడ్ జనాల్లో కూడా ఆసక్తి కనిపించింది. శర్వానంద్ కి కూడా ఈ కాన్సెప్ట్ నచ్చేయడంతో.. నీదీ నాదీ ఒకే కథ మూవీని హోల్ సేల్ గా కొనేయాలని అనిపించిందట. వెంటనే ప్రొడ్యూసర్స్ ను అప్రోచ్ అయ్యాడట కానీ.. అప్పటికే అన్ని ఏరియాలను అమ్మేశామని.. చెప్పారట మేకర్స్. దీంతో తను చాలా డిజప్పాయింట్ అయినట్లు చెబుతున్నాడు శర్వానంద్. రీసెంట్ గా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా.. తానే స్వయంగా ఈ విషయాలను చెప్పాడు శర్వా.
ప్రస్తుతం ఫిలిం ఇండస్ట్రీకి మంచి రోజులు వచ్చాయని.. కొత్త తరహా కథలతో కొత్త జనరేషన్ దర్శకులు అద్భుతాలు సృష్టించేస్తున్నారని అన్నాడు శర్వానంద్. నీది నాదీ ఒకే కథ ట్రైలర్ చూసినప్పటి నుంచి తాను శ్రీవిష్ణుకు ఫ్యాన్ అయిపోయానన్న శర్వా.. మాడ్యులేషన్.. డెలివరీ చూస్తుంటే.. ఇది మన సొంత కథ అనిపించేలా ఉందంటూ మూవీని ఆకాశానికి ఎత్తేశాడు.