Begin typing your search above and press return to search.
తేరుకోవడానికి ఆర్నెల్లు పట్టిందా బాస్?
By: Tupaki Desk | 3 Jun 2016 5:30 PM GMTమొన్న సంక్రాంతికి పెద్ద సినిమాలతో పోటీపడి మరీ విడుదలైన సినిమా ''ఎక్సప్రెస్ రాజా''. ఈ సినిమా సక్సెస్ తో శర్వానంద్ ఎక్కడికో వెళిపోతాడని అందరూ అంచనాలు వేశారు. అలాగే ఆ సినిమాకు కూడా 13+ కోట్లు షేర్ ఫుల్ రన్ లో వచ్చింది. కాని 10 కోట్ల పెట్టుబడితో తీసిన సినిమాకు అంత తక్కువ వస్తే.. కొన్ని చోట్ల దెబ్బలు తప్పవుగా మరి. అయినాసరే.. రీజన్ ఏంటో తెలియదు కాని.. శర్వానంద్ తన తదుపరి సినిమాను ఇంకా పట్టాలెక్కించలేదు.
ఫైనల్ గా దిల్ రాజు బ్యానర్ లో ''శతమానం భవతి'' అనే స్ర్కిప్టుకు శర్వానంద్ ఓకె చెప్పాడు. ఈ సినిమా షూటింగ్ ను ఆగస్టు నుండి మొదలెడుతున్నారు. అదే కాకుండా గతంలో దర్శకుడు కరుణాకరన్ దగ్గర అసోసియేట్ గా పనిచేసిన మరో నూతన దర్శకుడి సినిమాలో కూడా శర్వా నటించే ఛాన్సుందట. కాకపోతే అసలు మనోడు ఒక కథను సెలక్టు చేసుకోవడానికి ఆర్నెల్ల టైమ్ ఎందుకు పట్టింది అనేదే ఎవ్వరికీ అర్ధంకాని విషయం. ఒకవేళ ఎక్స్ ప్రెస్ రాజా ఇచ్చిన స్ర్టోక్ నుండి తేరుకోవడానికి ఇంత టైమ్ పట్టిందా?
ఏదేమైనా కూడా.. 20 కోట్ల వరకు మార్కెట్ తయారు చేసుకోవడం ఇప్పుడు శర్వానంద్ తదుపరి టార్గెట్. చూద్దాం మరి ఎంతవరకు రీచ్ అవుతాడో!!