Begin typing your search above and press return to search.

మహానుభావుడు ప్లాన్ వర్క్ అవుతుందా!

By:  Tupaki Desk   |   12 Sept 2017 12:40 PM IST
మహానుభావుడు ప్లాన్ వర్క్ అవుతుందా!
X
హిట్లు - ఫ్లాపులతో సంబంధం లేకుండా హ్యాపెనింగ్ హీరో శర్వానంద్ కెరీర్ సాగిపోతుంది. ఇప్పటికే ఈ ఏడాదిని శతమానం భవతి అంటూ ఓ బ్లాక్ బస్టర్ తో మొదలుపెట్టిన శర్వా ఆ వెంటనే రాథతో మాస్ ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే రాధతో బాక్సాఫీస్ దగ్గర కాస్త తడబడ్డ శర్వా ఇప్పుడు మహానుభావుడిగా దసరా బరిలోకి దిగాడు. సెప్టేంబర్ 29న మహేశ్ బాబు స్పైడర్ తో పాటు మహానుభావుడు విడుదల అవుతోంది. దీంతో ఇప్పటినుంచి ఈ మూవీ ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు. చిత్ర బృందం కాలేజీల్లో సాంగ్ రిలీజ్ ఈవెంట్లు నిర్వహిస్తూ - యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఇది కాసేపు పక్కనపెడితే మహానుభావుడి పై ట్రేడ్ వర్గాల్లో రకరకాల డిస్కషన్స్ మొదలైపోయాయి. పండగ సీజన్లు శర్వాకి కలిసొస్తాయని కొందరు అంటూంటే, క్రౌడ్ పుల్లర్స్ తో శర్వా పోటీ పడిన ప్రతిసారీ సూపర్ హిట్లు తన ఖాతాలో వేసుకుంటున్నాడని అంటున్నారు. నిజానికి ఈ రెండు స్టేట్ మెంట్స్ లో వాస్తవాలు లేకపోలేదు. గతేడాదితో పాటు ఈ ఏడాది కూడా సంక్రాంతి బరిలోకి దిగిన శర్వానంద్ వరుసగా ఎక్స్ ప్రెస్ రాజా - శతమానంభవతి వంటి సూపర్ హిట్స్ అందుకున్నాడు. ఇప్పుడు దసరాకి మహేశ్ బాబుతో పోటీ పడబోతున్నాడు. అయితే ఇంతవరకు నిన్నటితరవం టాప్ హీరోలతోనే పోటీ పడిన శర్వానంద్ తొలిసారిగా నేటితరం టాప్ హీరోని ఢీకొట్టేందుకు రెడీ అవుతున్నాడు. అందుకు తగ్గట్లుగానే మహానుభావుడు పై అటు మార్కెట్లో ఇటు ఇండస్ట్రీలో పాజిటివ్ సంకేతాలు వినిపిస్తున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో!