Begin typing your search above and press return to search.

ఔట్ అండ్ ఔట్ సంక్రాంతి సినిమా

By:  Tupaki Desk   |   13 Jan 2017 9:34 AM GMT
ఔట్ అండ్ ఔట్ సంక్రాంతి సినిమా
X
ప్రతీ ఏటా సంక్రాంతి పండుగకు ఇంటింటా సందడి సహజం. ఎక్కడెక్కడి నుంచో చుట్టాలు తమ సొంత ఊళ్లకు వచ్చి సొంతవారితో గడుపుతుంటారు. ఈ పండుగకు అచ్చ తెలుగు సంక్రాంతిని అందంగా చూపించే సినిమాగా శతమానం భవతి ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

'గతేడాది లాగే ఈ ఏడాది కూడా నాకు సంక్రాంతి కలిసొస్తుందని అనుకుంటున్నా. సినిమాలో కూడా సంక్రాంతి పండుగ సెలబ్రేషన్స్ ఉంటాయి. మనుషులు.. బంధువుల మధ్య ఉన్న చిన్నచిన్న ఎమోషన్స్ ను చూపించే సినిమానే శతమానం భవతి. గొప్ప సినిమా చూశామనే అనుభూతి కలిగిస్తుందని చెప్పను కానీ.. అందమైన ప్రేమకథతో పాటు.. ఫ్యామిలీ రిలేషన్స్ అండ్ ఎమోషన్స్ ను చూపిస్తుంది' అంటున్నాడు హీరో శర్వానంద్.

సంక్రాంతి పోటీ తమకు పెద్ద విషయం కాదని.. గతేడాది కూడా పోటీ మద్యే వచ్చిన హిట్ సాధించిన విషయాన్ని గుర్తు చేసిన శర్వా.. ఈ సినిమాలో మాడ్యులేషన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నానని.. అలాగే.. పక్కింటి కుర్రాడిగా కనిపిస్తానని అంటున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ లో తనకు మరింతగా గుర్తింపు తెచ్చిపెట్టే స సినిమా శతమానం భవతి అని చెప్పాడు శర్వా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/