Begin typing your search above and press return to search.
పక్కా స్క్రిప్ట్.. పది కోట్ల బడ్జెట్
By: Tupaki Desk | 10 May 2017 11:58 AM GMTచిన్న సినిమాలతో పెద్ద హిట్లు కొడుతూ తన మార్కెట్ పెంచుకుంటూ పోతున్నాడు హీరో శర్వానంద్. రన్ రాజా రన్ నుంచి కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. అందుకే రెండుసార్లు సంక్రాంతి బరిలో స్టార్ హీరోలతోపాటు బరిలో దిగినా ప్రాఫిట్స్ తోనే బయటపడ్డాడు. శతమానం భవతి సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా బాగా కనెక్టయి పోయాడు. తాజాగా అందాల రాక్షసి లావణ్య త్రిపాఠితో జంట కట్టి రాధ సినిమాతో వెండితెరపై సందడి చేయబోతున్నాడు.
స్టార్ హీరోలకే సాధ్యం కాని వరస హిట్లు శర్వానంద్ సాధించడం చిన్న విషయమేం కాదు.
ఏదో మాట వరసకు ఒకటి రెండు పాయింట్లు అనుకుని సినిమాకు క్లాప్ కొట్టేసి... ఆ తర్వాత వాటిచుట్టూ సీన్లు అల్లుకుని సినిమా ముగించేసే తంతు తన దగ్గర కుదరదంటున్నాడు శర్వానంద్. ఎవరైనా డైరెక్టర్ కు ఓకే చెప్పాలంటే ముందు పక్కా స్క్రిప్ట్ తన చేతిలో పెట్టాల్సిందే అంటున్నాడు. అది మొత్తం తాను చదివాక నచ్చితే ఓకే చెబుతానని, లేదంటే నిర్మొహమాటంగా కుదరదని చెప్పేస్తాను అంటున్నాడు. డైరెక్టర్లు దేవా కట్టా, క్రిష్ కూడా డైలాగ్ వెర్షన్ తో సహా స్క్రిప్ట్ ముందే ఇచ్చారని చెప్పాడు. అంతేకాదు.. తన మార్కెట్ పెరిగినా సరే... సినిమా బడ్జెట్ రూ. 10 కోట్లు దాటకూడదన్నది శర్వా మరో కండిషన్. ఎందుకంటే అతడి రేంజిలో ఇది సేఫ్ గేమ్. పెట్టిన పెట్టుబడి కచ్చితంగా తిరిగొస్తుంది. రెమ్యూనరేషన్ పెరగకపోతే లాభాల్లోె వాటా తీసుకుంటాడే తప్ప ఇప్పట్లో ఇదే బడ్జెట్ మెయిన్ టెయిన్ చేస్తానంటున్నాడు.
ఇటీవల కాలంలో వచ్చిన మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మళ్లీమళ్లీ ఇది రాని రోెజు. దానిని మించి ప్యూర్ లవ్ స్టోరీ చేయాలన్నది శర్వానంద్ కోరికట. ఇప్పటివరకు అలాంటి సబ్జెక్ట్ ఎవరూ తేలేదంటున్నాడు. ఇలాంటి స్టోరీ కావాలని తాను అడగనని... ఢైరెక్ట్రర్లు తెచ్చిన స్క్రిప్ట్ లో మంచిది ఎంచుకోవడమే తన పని అంటున్నాడు. రన్ రాజా రన్ తర్వాత తనకు అచ్చొచ్చిన ఫన్ జోనర్ లోనే ముందుకెళుతున్నాడు. ఇప్పుడొస్తున్న రాధ కూడా అదే తరహా చిత్రమని చెబుతున్నాడు. తర్వాత మారుతి డైరెక్షన్ లో వచ్చే మహానుభావుడు మాత్రం వేరే జోనర్ లో ఉంటుందని అంటున్నాడు. పెళ్లి మాటెత్తితే ముందు ప్రభాస్ చేసుుకన్నాక ఆలోచిస్తా అంటున్నాడు.