Begin typing your search above and press return to search.

'రాధ'కు అదే ఇచ్చారంటే.. లోపలేముందో

By:  Tupaki Desk   |   9 May 2017 4:49 AM GMT
రాధకు అదే ఇచ్చారంటే.. లోపలేముందో
X
ఆల్రెడీ బీభత్సమైన కామెడీ. పైగా పోలీస్ ఎస్సై రోల్ లో ఈ యంగ్ హీరో శర్వానంద్ నానా రచ్చ చేస్తున్నాడు. యాక్షన్ సీక్వెన్సులు ఉండనే ఉన్నాయ్. కట్చేస్తే లావణ్య త్రిపాటి గ్లామర్ ఆరబోత విపరీతంగానే ఉంది. లెహంగాలు వేసుకుని నాభి అందాలను సమర్పిస్తూ.. ఓ రెండు పాటల్లో మోడ్రన్ కురచ దుస్తుల్లో కత్తిలా రెచ్చిపోయింది. ఇక ఇలాంటి సినిమాకు సెన్సార్ నుండి ఏ సర్టిఫికేట్ వస్తుంది?

నిన్న మధ్యాహ్నం సెన్సారింగ్ కార్యక్రమాలకు వెళ్ళిన శర్వానంద్ కొత్త సినిమా ''రాధ''.. చక్కగా ఒక్క కట్ కూడా లేకుండా ''యు'' సర్టిఫికేట్ తో బయటకు వచ్చేసిందట. సినిమాకు క్లీన్ యు ఇచ్చేశారని ఇప్పుడు నిర్మాతలు తెగ సంబరపడిపోతున్నారు. నిజానికి పైనున్న అంశాలన్నింటినీ చూస్తే ''యు/ఎ'' వస్తుందని అందరూ అనుకుంటారు. కాని యు రావడమంటే మరి నిజంగానే విడ్డూరం. ఇకపోతే కొత్త దర్శకుడు చంద్రమోహన్ సినిమాను కాస్త రొటీన్ గానే తీసినా కూడా ఇంట్రెస్టింగ్ గా తీసుంటాడని ట్రైలర్లు చూస్తే అర్దమవుతోంది.

మరి కేవలం యు సర్టిఫికేట్ మాత్రమే ఇచ్చారంటే.. అసలు లోపలేముందో అనే సందేహం అందరికీ వస్తుందిలే. ఏదేమైనా కూడా బాహబులి 2 ప్రభంజనాన్ని బ్రేక్ చేయడానికి శర్వానంద్ ఇప్పుడు వచ్చే శుక్రవారం వచ్చేస్తున్నాడు. గెట్ రెడీ.