Begin typing your search above and press return to search.
రిపేర్ల కోసమే రాధ వాయిదా
By: Tupaki Desk | 15 May 2017 4:19 AM GMTయంగ్ హీరో శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ రాధ గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చేసింది. టాక్ ఎలా ఉన్న మంచి ఓపెనింగ్స్ తో పాటు వసూళ్లను కూడా రాబట్టగలుగుతోంది. ప్రతీసారి విభిన్న కథాంశాలతో సినిమాలు చేసే శర్వానంద్.. రొటీన్ కమర్షియల్ ను ఎంచుకోవడం ఆశ్చర్యకరంగా చెప్పుకుంటున్నారు సినీ జనాలు.
మూవీ పిక్చరైజే చేస్తున్నపుడే శర్వాకి కొన్ని అనుమానాలు తలెత్తాయట. అందుకే దాదాపు ఔట్ పుట్ సిద్ధమైపోయి.. ఉగాది రిలీజ్ అనుకున్నా.. అప్పట్లో వాయిదా వేశారట. ఆ తర్వాత ఈ రాధను దిల్ రాజు.. యూవీ క్రియేషన్స్ కు చూపించి.. అవసరమయితే రిపేర్లు సూచించాలని కోరాడట. రాధ నిర్మాత బీవీఎస్ ప్రసాద్ కూడా ఇందుకు సరే అనడంతో.. ఓ అరగంట మేర సినిమాకు కోత వేసి ఒకట్రెండు సీన్స్ జోడించాలని సలహా ఇచ్చారట. అలా రిపేర్ల కోసమే మార్చ్ నుంచి ఈ మూవీ మే నెలకు వాయిదా పడింది తప్ప.. కాటమరాయుడు కోసం కాదనే విషయం ఇప్పుడు చెప్పుకుంటున్నారు.
అయినా.. అరగంట కోత పడ్డ సినిమాకే రొటీన్ సినిమా.. కథ లేదు.. రెగ్యులర్ కమర్షియల్ లాంటి విమర్శలు వస్తే మొత్తం మూవీ యాజిటీజ్ గా విడుదల చేస్తే పరిస్థితి ఎలా ఉండేదో.. అయితే మూవీ ఎలా ఉన్నా కానీ.. శర్వా రీసెంట్ ఫాం మాత్రం రాధకు బాగా ప్లస్ అయింది.