Begin typing your search above and press return to search.

టీజర్ పోస్టర్.. రఫ్ లుక్ లో శర్వా కిరాక్!

By:  Tupaki Desk   |   28 Jun 2019 7:43 PM IST
టీజర్ పోస్టర్.. రఫ్ లుక్ లో శర్వా కిరాక్!
X
శర్వానంద్ ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో 'రణరంగం' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జోరుగా సాగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా టీజర్ ను రేపు రిలీజ్ చేస్తున్నామంటూ ఒక పోస్టర్ విడుదల చేశారు.

జూన్ 29 వ తేదీ సాయంత్రం సరిగ్గా 4.05 గంటలకు 'రణరంగం' టీజర్ ను విడుదల అవుతుందని పోస్టర్ లో టైమ్ కూడా చెప్పారు. ఈ సినిమాలో శర్వా ఒక గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దానికి తగ్గట్టే శర్వా ఈ టీజర్ పోస్టర్లో రఫ్ లుక్ లో ఉన్నాడు. పొడవాటి జుట్టు.. గడ్డం.. కళ్ళకు కూలింగ్ గ్లాసెస్ ధరించి ఇంటెన్స్ గా చూస్తున్నాడు. బ్రౌన్ కలర్ షర్టు.. ఎగరేసిన కాలర్ తో రఫ్ యాటిట్యూడ్ కనిపిస్తోంది.

ఈ సినిమాలో శర్వా రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడు. యువకుడిగా.. మధ్యవయస్కుడైన డాన్ గా డిఫరెంట్ షేడ్స్ లో శర్వా నటన సినిమాకే హైలైట్ అవుతుందనే టాక్ ఉంది. శర్వానంద్ సరసన కాజల్ ఆగర్వాల్.. కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడు ప్రశాంత్ పిళ్ళై. ఈ సినియాను ఆగష్టు 2 వ తారీఖున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.