Begin typing your search above and press return to search.
చాలా రోజులకు స్వచ్ఛమైన గాలి పీల్చానన్న శర్వా
By: Tupaki Desk | 1 Oct 2020 4:00 PM GMTఇటీవల చాలా చిత్రాల షూటింగ్ లు తిరిగి ప్రారంభం అయ్యాయి. యంగ్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు చాలా మంది హీరోలు తమ సినిమాలని తిరిగి ప్రారంభించారు. హీరో శర్వానంద్ కూడా ఈ జాబితాలో చేరిపోయారు. నూతన దర్శకుడు శ్రీ కార్తీక్‌తో కలిసి తెలుగు- తమిళ ద్విభాషా ఓ చిత్రం చేస్తున్నారు. కార్తీతో `ఖైదీ` వంటి ప్రయోగాత్మక చిత్రాన్ని అందించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన చివరి షెడ్యూల్ చెన్నైలో ప్రారంభమైంది.
అక్కడ కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. లాక్ డౌన్ తరువాత కెమెరా ముందుకు తిరిగి రావడం చాలా రోజుల తరువాత స్వచ్ఛమైన గాలి పీలుస్తున్నట్టుగా వుంది. దాదాపు ఏడు నెలల విరామం తరువాత తిరికి చిత్రీకరణలో పాల్గొంటుండటం నిజంగా ఆనందంగా వుంది అని శర్వా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ మూవీ సెట్ లో శర్వాతో పాటు సెట్ లో ఉన్న ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ చిత్రంలో పెళ్లి చూపులు ఫేం రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా అక్కినేని అమల కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇందులో ఆమె శర్వానంద్‌కు తల్లిగా అమల అక్కినేని నటిస్తున్నారు. తెలుగు- తమిళ భాషల్లో ఏక కాలంలో ఈ చిత్రం విడుదల కానుంది. స్వేచ్ఛా గాలులు పీలుస్తున్నా సెట్లో మాత్రం హైటెన్షన్ తప్పనిసరి. అన్ లాక్ 5.0లో థియేటర్లు ఓపెన్ చేసేస్తున్నారు కాబట్టి షూటింగుల స్పీడ్ మరింత పెరుగుతుందనడంలో సందేహమేం లేదు.