Begin typing your search above and press return to search.

శర్వా అండ్ పల్లవి.. అదే స్టోరీ

By:  Tupaki Desk   |   28 Dec 2017 4:10 PM IST
శర్వా అండ్ పల్లవి.. అదే స్టోరీ
X
ఈ ఏడాది శతమానం భవతి సినిమాతో మొదలు పెట్టి మహానుభావుడి సినిమాతో 2017ని సక్సెసఫుల్ గా పూర్తి చేసుకున్న హీరో శర్వానంద్. నిజంగా ఈ ఇయర్ శర్వానంద్ చాలా లక్కీ హీరో అని చెప్పాలి. ఎందుకంటే ఆ రెండు సినిమాలో పండగల సమయాల్లోనే రిలీజ్ అయ్యి మనోడికి ఫెస్టివల్ స్టార్ అనే బిరుదును ఇచ్చాయి. పోటీగా స్టార్ హీరోల సినిమాలు వచ్చినా కూడా శర్వా సినిమాలు మంచి కలెక్షన్స్ అందుకున్నాయి. ఒక్క రాధా మాత్రం ప్లాప్ అయ్యి అనుభవం నేర్పింది.

ఇకపోతే ఈ హీరో మార్కెట్ కూడా చాలా పెరిగింది. దీంతో తారాగణం నుంచి టెక్నీషియన్స్ వరకు స్టార్ హీరోల రేంజ్ లో శర్వా సినిమాలు రూపొందుతున్నాయి. అయితే నెక్స్ట్ ఇయర్ కూడా మంచి సక్సెస్ లను అందుకోవాలని తొందరపడకుండా తనకు సెట్ అయ్యే కథలను మాత్రమే చేస్తున్నాడు. ఇటీవల హను రాఘవాపుడి దర్శకత్వంలో ఒక సినిమాను ఒకే చేసిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా లాంచ్ అయినా ఆ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. దీంతో సినిమాపై ఓ స్థాయి వరకు అంచనాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. శర్వా మంచి హిట్ ట్రాక్ లో ఉన్నాడు. ఇక సాయి పల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులోను ఇది లవ్ స్టోరీ కావడంతో రిలీజ్ డేట్ కోసం ఓ వర్గం వారు చాలా ఆసక్తిని చూపిస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

అలాగే దర్శకుడు హను కూడా లవ్ స్టోరీస్ ని అందంగా తెరకెక్కించగలడు. అందాల రాక్షసి - కృష్ణ గాడి వీర ప్రేమగాధ సినిమాలో లవ్ సీన్స్ క్లిక్ అయ్యాయి. మరి ఈ జోడితో రొమాంటిక్ సీన్స్ ని డైరెక్టర్ ఏ విధంగా చిత్రీకరిస్తాడో చూడాలి. ఇంకా టైటిల్ సెట్ చేయాలనీ ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ జనవరి 20 నుంచి స్టార్ట్ కానుంది.