Begin typing your search above and press return to search.
శర్వా సామ్ ల 96 సీక్రెట్
By: Tupaki Desk | 14 Dec 2018 4:30 PM GMTతమిళ్ లో ఈ ఏడాదిలోకెల్లా సర్ప్రైజింగ్ హిట్ గా నిలిచిన 96 తెలుగు రీమేక్ కోసం అడుగులు వేగంగా పడుతున్నాయి. ఆ సినిమా విడుదలకు ముందే అందులో కంటెంట్ ని పసి గట్టిన నిర్మాత దిల్ రాజు తెలుగు రీమేక్ హక్కులు కొన్న సంగతి తెలిసిందే. విజయ్ సేతుపతి త్రిషలు ప్రాణం పోసిన పాత్రలు ఇక్కడ ఎవరు చేస్తారా అనే సస్పెన్స్ కొంతకాలం నుంచి వెంటాడుతూనే ఉంది. నాని పేరు ఓసారి కాదు అల్లు అర్జున్ అంటూ మరోసారి లేదు గోపీచంద్ ఫిక్స్ అయ్యాడు అని ఇంకోసారి ఇలారకరకాలుగా వార్తలు ప్రచారం లో ఉంటూనే వచ్చాయి.
కాని ఫైనల్ గా శర్వానంద్ సమంతాలు లాకయ్యారు అనేది ఇప్పుడు లేటెస్ట్ అప్ డేట్. నిజానికి కొంచెం రిస్క్ అనిపించే 96ని ఒప్పుకోవడానికి ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయట. ముందు శర్వానంద్ విషయం చూసుకుంటే మహానుభావుడు తర్వాత ఏడాది గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. రాధ ఫ్లాప్ నేర్పిన పాఠానికి రెగ్యులర్ సినిమాల జోలికి వెళ్ళకూడదు అని గట్టిగా నిర్ణయించుకున్న శర్వా ఫీల్ గుడ్ స్టోరీస్ తో యూత్ ని ఫ్యామిలీని మెయిన్ గా టార్గెట్ చేస్తున్నాడట. అయితే 96లో కథ ప్రకారం హీరో వయసు 38 సంవత్సరాలు. మిడిల్ ఏజ్ కాబట్టి అలా చూపిస్తే తనను యాక్సెప్ట్ చేస్తారా అనే ఆలోచన చేసాడట శర్వా.
హీరో పదో తరగతి 96లో పూర్తయినట్టు కాకుండా 2006లో అయితే ఏజ్ సమస్య రాదు అనే కోణంలో చర్చలు జరిగాయట. అయితే మళ్ళి మళ్ళి రాని రోజులో వయసు మళ్ళిన పాత్రలో ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్నారు కాబట్టి దాని కన్నా ఇది చాలా చిన్న వయసు పాత్ర కావడం అనే యాంగిల్ లో దర్శకుడు ఒప్పించడంతో ఫైనల్ గా ఓకే చెప్పాడట. ఇక పెళ్లి తర్వాత గ్లామర్ రోల్స్ ఆపేసిన సమంతా పెర్ఫార్మన్స్ కు స్కోప్ ఉన్న వాటిని ఏరికోరి ఎంచుకుంటోంది. మిస్ గ్రానీ రీమేక్ తో పాటు ఈ 96 రీమేక్ కూడా తనకో మైల్ స్టోన్ లా మిగిలిపోతుందనే ఉద్దేశంతో ఓకే చెప్పిందట. అదండీ 96 కహాని