Begin typing your search above and press return to search.
అదీ.. మెగాస్టార్ అంటే!! -శర్వానంద్
By: Tupaki Desk | 28 Jan 2017 4:57 AM GMT''నేను నా సినిమా చేస్తున్నప్పుడు కూడా అంత టెన్షన్ పడలేదు. కాని ఈ కార్యక్రమానికి చిరంజీవి అంకుల్ వస్తున్నారంటే మాత్రం భయపడ్డాను. ఎందుకంటే ఆయనంటే అంత గౌరవం నాకు'' అంటూ 'శతమానం భవతి' సినిమా సక్సెస్ మీట్లో చెప్పుకొచ్చాడు హీరో శర్వానంద్. ఈ సందర్భంగా అసలు చిరంజీవి ఎందుకు గ్రేట్ అనేది రెండు విషయాలతో చెబుతానంటూ.. ఆ రెండూ వివరించాడు.
''హీరో అవ్వడానికి బ్లెస్సింగ్ తీసుకోవడానికి వెళ్లినప్పుడు.. ఆయన ఒకటే విషయం చెప్పారు. 'డైరక్టర్ నుండి కెమెరామ్యాన్ వరకు.. లైట్ బాయ్ వరకు.. అందరినీ ఒకేలా చూడు' అన్నారు. అదే సక్సెస్ మంత్ర నేను ఫాలో అవుతున్నాను'' అంటూ తనను ఇనస్పయిర్ చేసిన ఆ మొదటి పాయింట్ ను చెప్పాడు శర్వా. ఆ తరువాత మాట్లాడుతూ.. తను శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాలో చిన్న రోల్ చేయాల్సి ఉంటే.. నిర్మాతలను వెళ్ళి కలవకపోవడం వలన ఆ రోల్ రెండు నెలల లేటైందని.. కాని చివరకు ఆ రోల్ తను చేయట్లేదని తెలుసుకుని.. రెండు నెలల తరువాత.. తన కోసం ఒక రోజు షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని మరొక రోజున సినిమా షూట్ పెట్టారని. అంత పెద్ద స్టార్ నాకోసం అంత చేయక్కర్లేదు.. ''కాని అదీ మెగాస్టార్ అంటే'' అని చెప్పాడు. ఇక అదే విషయం మాట్లాడటానికి చిరంజీవిని ఇంటికి వెళ్ళి కలస్తే.. ''నాదేముందిరా గొప్పతనం.. నీ సంకల్సం గొప్పది. నీ సంకల్పం గొప్పదైతే దేవుడు తలరాతను తిరగరాస్తాడు అని చెప్పారు. అదీ మెగాస్టార్ అంటే. థ్యాంక్యూ అంకుల్. మీరి చెప్పిన ఆ మాటలు.. చూపించిన ఆ ప్రేమే ఇక్కడవరకు తీసుకొచ్చాయ్'' అంటూ సెలవిచ్చాడు శర్వానంద్. ''ఐ విల్ నెవర్ ఫర్ గెట్ దిస్ లవ్'' అన్నాడు కూడా.
''ఆయన్ను ఒక ఫంక్షన్ కు పిలువాలంటే.. అదొకటి ఉండాలి. నా 25వ సినిమాకు అది జరిగింది. కాకపోతే 25 సినిమాకు ఆయనతో ఆడియో లాంచ్ చేయించుకోవాలని అనుకున్నాను. కాని సక్సెస్ మీట్ కు పిలిచారు దిల్ రాజు. సినిమా హిట్టుతో పాటు ఈ చిరు గిఫ్టును కూడా ఇచ్చినందుకు థ్యాంక్స్'' అని సెలవిచ్చాడు.
ఇక సినిమా గురించి మాట్లాడుతూ.. ''అక్టోబర్ లో 20 రోజులు.. నవంబర్ లో 30 రోజులు.. డిసెంబర్ లో పోస్ట్ ప్రొడక్షన్.. జనవరిలో రిలీజ్.. బ్లాక్ బస్టర్.. భారీ కలక్షన్లు.. మొత్తం నాలుగు నెలల్లో అయిపోయింది'' అని చెప్పాడు. సినిమా యునిట్ అందరికీ థ్యాంక్స్ చెబుతూ.. ''తొలిసారి ఒక పెద్ద హిట్టుకొట్టినట్లు.. నిజంగానే మనస్సులో హిట్టు కొట్టాను అనే భావన కలుగుతోంది. ఆడియన్స్ కు థ్యాంక్స్'' అని ముగించాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/