Begin typing your search above and press return to search.

వెన్నెల కిశోర్ తప్పించుకున్నాడు .. ఎక్కడున్నా వదలను: శర్వా

By:  Tupaki Desk   |   8 Sep 2022 3:06 AM GMT
వెన్నెల కిశోర్ తప్పించుకున్నాడు .. ఎక్కడున్నా వదలను: శర్వా
X
శర్వానంద్ హీరోగా 'ఒకే ఒక జీవితం' రూపొందింది. ఎస్.ఆర్.ప్రభు నిర్మించిన ఈ సినిమాకి శ్రీకార్తీక్ దర్శకత్వం వహించాడు. శర్వానంద్ జోడీగా రీతూ వర్మ నటించిన ఈ సినిమాలో ఆయన తల్లి పాత్రను అమల అక్కినేని పోషించారు. తల్లి ప్రేమను పొందడం కోసం కాలంలో వెనక్కి వెళ్లే ఓకే కొడుకు కథ ఇది. ఎంటర్టైన్ మెంట్ తో పాటు ఎమోషన్స్ బలంగా ఉన్న సినిమా ఇది. అలాంటి ఈ సినిమాను ఈ నెల 9వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి హైదరాబాదులో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.

ఈ స్టేజ్ పై శర్వానంద్ మాట్లాడుతూ .. "ముందుగా మా సినిమా టెక్నీషియన్స్ ను గురించి చెప్పుకోవాలి. పాటల పరంగా .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా జేక్స్ బిజోయ్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లాడు. ఫొటోగ్రఫీ .. ఎడిటింగ్ వర్క్ కూడా గొప్పగా అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలోని చైల్డ్ ఆర్టిస్టులంతా గొప్పగా చేశారు.

స్పెషల్ షో చూసిన వాళ్లంతా కూడా పిల్లలతో అంత బాగా ఎలా చేయించారు? అనే అడుగుతున్నారు. వాళ్లందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంది. ఈ సినిమా చేసిన ప్రతి ఒక్కరూ ఈ సినిమా నాది .. నేను హీరోని అనుకునే చేశారు. అందువల్లనే ఈ సినిమా ఇంతబాగా వచ్చింది.

అందరం కలిసికట్టుగా ఈ సినిమా చేయడానికి కారణం .. కథనే. ప్రియదర్శి చాలా బాగా చేశాడు .. వెన్నెల కిశోర్ మాత్రం మిస్సయ్యాడు. ఈ సినిమా ఇప్పించింది కూడా నేనే .. వాడి సంగతి తరువాత చెబుతాను. ' ఒరేయ్ కిశోర్ ఎక్కడున్నా గుర్తుపెట్టుకో .. వస్తున్నాను నీ దగ్గరికి' అంటూ సరదాగా వార్నింగ్ ఇచ్చాడు. ఆ తరువాత కొనసాగిస్తూ .. "ఈ సినిమాలో మీరు ఇంకో కిశోర్ ను చూస్తారు. ఇక రీతూ వర్మ విషయానికి వస్తే ఒక మంచి సినిమాలో తాను ఉండాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. అందుకు ఆమెకి నేను థ్యాంక్స్ చెబుతున్నాను.

అమలగారు లేకుండా నేను ఈ సినిమాను ఊహించలేను. ఆమెతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం కలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అమలగారిలో నాకు మా అమ్మనే కనిపిస్తారు .. అందువలన నా పాత్ర పెద్ద కష్టంగా అనిపించలేదు.

ఈ సినిమా రిలీజ్ వరకూ సైలెంట్ గా ఉండమని అమలగారు చెప్పారు .. అదే పద్ధతిని ఫాలో అవుతున్నాను. దర్శకుడు శ్రీకార్తీక్ ఈ సినిమాతో ఎక్కడికో వెళతాడనే నమ్మకం నాకు ఉంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా నిర్మాత ప్రభు, ఈ సినిమాను థియేటర్స్ కి తీసుకుని రావడానికి వెయిట్ చేయడం గొప్ప విషయం. ఆడియన్స్ కి ఇది నా ప్రామిస్. మిమ్మల్ని డిజప్పాయింట్ చేయను .. ఒక మంచి సినిమాను చూపిస్తాను" అంటూ చెప్పుకొచ్చాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.