Begin typing your search above and press return to search.
స్పీడ్ మీదున్న శర్వా.. శ్రీకారం చుట్టాడు!
By: Tupaki Desk | 30 Jun 2019 6:48 AM GMTహీరో శర్వానంద్ కొత్త సినిమా 'రణరంగం' త్వరలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈమధ్యే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను మెప్పించడంతో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. ఇదిలా ఉంటే శర్వానంద్ తన సినిమా విడుదల కాక మునుపే మరో ఇంట్రెస్టింగ్ సినిమాను లైన్ లో పెట్టాడు. శర్వా కొత్త సినిమా నిన్నే లాంచ్ అయింది. కిషోర్ రెడ్డి అనే దర్శకుడు చెప్పిన కథకు ఇంప్రెస్ అయిన శర్వా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందట.
ఈ సినిమాను 14 రిల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట... గోపీచంద్ ఆచంట ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు టాప్ లీగ్ టెక్నిషియన్స్ ను ఎంపిక చేసుకున్నారు. సంగీత దర్శకుడిగా మిక్కీ జే మేయర్.. సినిమాటోగ్రాఫర్ గా యువరాజ్.. డైలాగ్ రైటర్ గా సాయి మాధవ్ బుర్రా ఈ చిత్రానికి పని చేస్తారు. నిన్న జరిగిన మూవీ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు సుకుమార్ మొదటి షాట్ కు క్లాప్ కొట్టడం జరిగింది. ఎన్నారై శశికాంత్ వల్లూరి కెమెరాను స్విచ్ ఆన్ చేశారు.
మొదలు పెట్టడమే ఆలస్యం ఈ సినిమాకు 'శ్రీకారం' అనే టైటిల్ ను లాక్ చేశారు. సో.. టైటిల్ విషయంలో ఎలాంటి అనుమానాలకు.. గాసిప్స్ కు తావు లేదు. శర్వా సినిమా టైటిల్స్ ఈమధ్య అచ్చతెలుగు పదాలు ఉంటున్నాయి. అదే కోవలో ఈ సినిమా టైటిల్ కూడా తెలుగుదనం టచ్ ఇచ్చింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగష్టు మొదటివారంలో ప్రారంభం అవుతుందని.. వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్లో రిలీజ్ చేయాలని ఫిలిం మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.