Begin typing your search above and press return to search.

బ్యాంక్ ప్రారంభిస్తున్న శర్వానంద్!!

By:  Tupaki Desk   |   30 Jan 2018 6:07 AM GMT
బ్యాంక్ ప్రారంభిస్తున్న శర్వానంద్!!
X

యంగ్ హీరో శర్వానంద్ ఇప్పుడు ఫుల్ స్పీడ్ లో ఉన్నాడు. హీరోగా ప్రతీ సినిమాతోను తన స్థాయిని పెంచుకుంటున్న ఈ హీరో.. బ్లాక్ బస్టర్లతో అలరిస్తున్నాడు. శతమానం భవతి.. మహానుభావుడు చిత్రాల తర్వాత శర్వానంద మార్కెట్ గణనీయంగా పెరిగిపోయింది. ఇప్పుడీ హీరో ఓ బ్యాంక్ స్టార్ట్ చేస్తున్నాడు.

బ్యాంక్ అంటే ఆర్థిక లావాదేవీల కోసం కాదు.. శర్వా స్టార్ట్ ఓ స్టోరీ బ్యాంక్ మొదలుపెట్టబోతున్నాడట. కొంతమంది ప్రతిభావంతులైన రైటర్స్ ను తన దగ్గరే రిక్రూట్ చేసుకుని.. మంచి కథలు - స్టోరీ లైన్స్ ను రూపొందించబోతున్నాడట. వినూత్నమైన కాన్సెప్టులను అందించడం.. వాటిని స్క్రిప్ట్ లుగా అభివృద్ధి చేయడం వీరి పని. గత కొన్నేళ్లుగా వైవిధ్యభరితమైన చిత్రాలతో అలరిస్తున్న ఈ హీరో.. సినిమా కథతో పాటు పక్కనే నడవాల్సిన ఇతర పాత్రలకు సంబంధించిన బేస్ గురించి కూడా బాగా అర్ధమైందట. తన సినిమాలను నిత్యనూతనంగా అందించేందుకు గాను.. ఈ స్టోరీ బ్యాంక్ ఆలోచన చేస్తున్నాడని తెలుస్తోంది.

ప్రతీ సినిమాతోను పూర్తి స్థాయిలో అలరించడమే లక్ష్యంగా ఈ పని చేస్తున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటికే పలు ప్రొడక్షన్ హౌస్ లకు రైటర్ల కూర్పు ఉంటుంది. కానీ శర్వానంద్ మాత్రం ఈ కాన్సెప్ట్ ను ఓ స్టోరీ బ్యాంక్ మాదిరిగా అభివృద్ధి చేయనున్నాడని తెలుస్తోంది. అనేక మంది కొత్త రైటర్లకు అవకాశాలు చిక్కడంతో పాటు.. శర్వాకు ఇది పర్సనల్ గా కూడా కలిసొస్తుందని సినీ జనాలు అంటున్నారు.