Begin typing your search above and press return to search.
మరో షాక్: శర్వా భుజానికి గాయం
By: Tupaki Desk | 16 Jun 2019 5:36 AM GMTటాలీవుడ్ కి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి! ఇండస్ట్రీలో ప్రమాదాలకు సంబంధించిన వార్తలు వేడెక్కిస్తున్నాయి. ఒక హీరో వెంట ఒకరుగా ప్రమాదాలతో గాయాల పాలవుతుండడంపై ప్రస్తుతం పరిశ్రమ యావత్తూ ఆసక్తికరంగా ముచ్చటించుకుంటున్నారు. వరుస ప్రమాదాలు షూటింగులకు విఘాతాలుగా పరిణమించాయి. వరుణ్ తేజ్ కార్ యాక్సిడెంట్ .. శౌర్య.. సందీప్ కిషన్ ఆన్ సెట్స్ ప్రమాదాలు వెంటవెంటనే బయటపడడంతో అసలేం జరుగుతోంది? అంటూ అంతా షాక్ కి గురయ్యారు.
ఈలోగానే మరో షాకింగ్ న్యూస్ ఇది. వెర్సటైల్ స్టార్ శర్వానంద్ భుజానికి గాయమైందన్నది ఆ వార్త సారాంశం. అయితే శర్వా గాయానికి కారణమేంటి? అన్నది ఆరాతీస్తే షాకింగ్ నిజమే తెలిసింది. ప్రస్తుతం శర్వానంద్ తమిళ బ్లాక్ బస్టర్ 96 తెలుగు రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం శర్వా చాలానే రిస్కులు చేస్తున్నాడట. అతడు బ్యాంకాక్ లో స్కైడైవింగ్ నేర్చుకున్నాడని ఇదివరకూ వార్తలొచ్చాయి. ఐదు రోజుల పాటు స్కై డైవింగ్ శిక్షణ కోసం వెళ్లాడు. అయితే అక్కడ ఊహించని రీతిలో ప్రమాదం జరిగిందట. నాలుగు రోజులు ఎంతో ఉత్సాహంగా డైవింగ్ లో శిక్షణ పొందాడు. అయితే ఐదో రోజు అనూహ్యంగా విపరీతమైన గాలి వీయడంతో స్కై డైవింగ్ లో ప్రమాదం సంభవించింది. అతడు కింద పడుతూ తనని తాను కాపాడుకోబోయి భుజంపై వాలిపోయాడట. దాంతో భుజానికి ఫ్రాక్చర్ అయ్యిందని తెలుస్తోంది.
ప్రమాదం జరిగిన తర్వాత అతడు హైదరాబాద్ కి తిరిగి వచ్చేశారు. నిన్న సాయంత్రం శర్వానంద్ సికిందరాబాద్ సన్ షైన్ ఆస్పత్రిలో చేరారని తెలుస్తోంది. డాక్టర్లు భజానికి తగిలిన గాయాన్ని పరిశీలించి భజం ఎముకలు పక్కకు జరిగాయి.. సర్జరీ చేయాల్సి ఉంటుందని చెప్పారట. ఈ సోమవారం (రేపు) శస్త్ర చికిత్సకు ఏర్పాట్లు సాగుతున్నాయని తెలుస్తోంది. అటుపై కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. శర్వా త్వరగా కోలుకుని తిరిగి చిత్రీకరణలో పాల్గొనాలని ఆకాంక్షిద్దాం. ఇటీవల ఆన్ లొకేషన్ గాయాలపాలైన హీరోలంతా త్వరగా కోలుకోవాలని .. తిరిగి యథావిధిగా సెట్స్ కి వెళ్లాలని కోరుకుందాం.