Begin typing your search above and press return to search.
రాజకీయ నాయకుడి మనవరాలితో శర్వానంద్ పెళ్లి
By: Tupaki Desk | 6 Jan 2023 3:48 AM GMTటాలీవుడ్ యువనటుల్లో ప్రత్యేకత కలిగిన నటుడిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు శర్వానంద్. జయాపజయాలతో సంబంధం లేకుండా పరిశ్రమలో స్థిరంగా అవకాశాలు అందుకుంటున్నాడు. చక్కని ప్రతిభావంతుడిగా దర్శకనిర్మాతల డార్లింగ్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. తాజా సమాచారం మేరకు శర్వానంద్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు.
అతడి నిశ్చితార్థం ఈ నెల 26న జరగనుందని తెలిసింది. వధువు స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి మనవరాలు. బొజ్జల కుటుంబానికి టీడీపీతో సుదీర్ఘ అనుబంధం ఉంది. వధువు మేనమామ బొజ్జల సుధీర్ రెడ్డి కూడా కాళహస్తికి చెందిన టీడీపీ నేత. చాలా మంది సినీ ప్రముఖులతోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి.
ఇది పెద్దలు కుదిర్చిన సంబంధం. పెళ్లి కుమార్తె లేదా వారి తరపు బంధువులతో శర్వాకు ఎలాంటి పరిచయాలు లేవని తెలిసింది. తాజా గుసగుసల ప్రకారం..కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో డెస్టినేషన్ వెడ్డింగ్ ని ప్లాన్ చేస్తున్నారని ..వేసవిలో పెళ్లి జరుగుతుందని సమాచారం. అయితే దీనికి సంబంధించి అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.
గత ఏడాది దగ్గుబాటి రానా- నిఖిల్ సిద్ధార్థ్- నితిన్ లాంటి యువహీరోల పెళ్లిళ్లు జరిగాయి. ఇప్పుడు ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకడిగా ఉన్న శర్వానంద్ కూడా పెళ్లాడేస్తున్నాడు. మిగిలిన వారిలో ప్రభాస్ ఇంకా పెళ్లి ఊసెత్తడం లేదు. విజయ్ దేవరకొండ పెళ్లాడేందుకు ఇంకా కొంత సమయం పడుతుందని అంటున్నాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.