Begin typing your search above and press return to search.

మెగా కోడలి షార్ట్ మూవీలో వర్సటైల్ హీరో..?

By:  Tupaki Desk   |   3 Jun 2021 3:00 PM IST
మెగా కోడలి షార్ట్ మూవీలో వర్సటైల్ హీరో..?
X
మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. అపోలో లైఫ్ వైస్ చైర్‌ పర్సన్‌ గా మరియు బీ పాజిటివ్ మ్యాగజైన్ చీఫ్ ఎడిటర్‌ గా ఉంటూనే.. ఫ్యామిలీ బాధ్యతలు కూడా సమర్ధవంతంగా నిర్వహిస్తోంది. యువర్ లైఫ్ వెబ్ పోర్టల్ నిర్వహిస్తున్న ఉపాసన.. ఆరోగ్యానికి సంబంధించన విషయాలను పంచుకొంటూ అందరినీ ఉత్తేజపరుస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు కరోనా సమయంలో డాక్టర్లు అందిస్తున్న సేవలను కొనియాడుతూ ఓ షార్ట్ ఫిలిం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

విపత్కర పరిస్థితుల్లో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉంటూ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజలకు తమ సేవలు అందిస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది గురించి ఈ లఘు చిత్రంలో చెప్పబోతున్నారట. అయితే ఇందులో యువ హీరో శర్వానంద్ కూడా నటిస్తారని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు డాక్టర్ పాత్రలో ఆయన కనిపించబోతున్నారని అంటున్నారు. చరణ్ - శర్వా ఇద్దరూ మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. ఆ విధంగా శర్వా కూడా ఈ పాత్ర చేయడానికి అంగీకరించారట. ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.

ఇక శర్వానంద్ సినిమాల విషయానికొస్తే.. ఇటీవల విడుదలైన 'శ్రీకారం' సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, వసూళ్లు రాబట్టలేకపోయింది. ఈ క్రమంలో ప్రస్తుతం 'మహాసముద్రం' అనే యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నాడు. అలానే తెలుగు తమిళ భాషల్లో రూపొందుతున్న బైలింగ్విల్ షూటింగ్ పూర్తి చేశాడు. కిశోర్ తిరుమ‌ల దర్శకత్వంలో శర్వా 'ఆడాళ్లు మీకు జోహార్లు' అనే చిత్రాన్ని ఇటీవలే ప్రారంభించాడు.