Begin typing your search above and press return to search.

సీరియస్.. ఇంటెన్స్ లుక్ లో స్టైలిష్ డాన్

By:  Tupaki Desk   |   4 Aug 2019 9:44 AM GMT
సీరియస్.. ఇంటెన్స్ లుక్ లో స్టైలిష్ డాన్
X
సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్.. కాజల్ అగర్వాల్.. కళ్యాణి ప్రియదర్శన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం 'రణరంగం'. రిలీజ్ కు మరో పదిరోజులే ఉండడంతో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకుంటున్నాయి. పోస్టర్స్.. టీజర్.. లిరికల్ సాంగ్స్ తో జోరు మీదున్న 'రణరంగం' టీమ్ తాజాగా ఈ సినిమా నుండి మరో పోస్టర్ ను విడుదల చేశారు.

'రణరంగం'లో శర్వా రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడనే సంగతి తెలిసిందే. యువకుడిగా.. మధ్యవయస్కుడైన డాన్ గా డిఫరెంట్ షేడ్స్ లో తెలుగు ప్రేక్షకులను శర్వా మురిపించబోతున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో.. గుబురు గడ్డంతో ఇంటెన్స్ గా కనిపిస్తున్నాడు. బ్లాక్ కలర్ బ్లేజర్ ధరించి హాలీవుడ్ ఫిలిం 'గాడ్ ఫాదర్' లోని మార్లన్ బ్రాండో తరహాలో ఒక పెద్ద కుర్చీలో కూర్చున్నాడు. నేపథ్యంలో ఉన్న బ్లాక్ షేడ్ ఈ పోస్టర్ ఇంటెన్సిటీని మరింతగా పెంచింది.

ఈరోజు.. అంటే ఆదివారం సాయంత్రం 'రణరంగం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కాకినాడలో జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ హజరవుతున్నారు. ప్రశాంత్ పిళ్ళై ఈ సినిమాకు సంగీత దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఆగష్టు 15 వ తారీఖున 'రణరంగం' ప్రేక్షకుల ముందుకు రానుంది.