Begin typing your search above and press return to search.
నేపాల్ టూర్ లో శర్వా షూటింగ్
By: Tupaki Desk | 16 Nov 2017 6:54 AM GMTశర్వానంద్ ఈ ఏడాది ఫుల్ జోష్ లో ఉన్నాడు. సమ్మర్ లో వచ్చిన రాధ డిజప్పాయింట్ చేసినా.. ప్రారంభంలో వచ్చిన శతమానం భవతి.. దసరాకు వచ్చిన మహానుభావుడు మూవీస్ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఒకే ఏడాది రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన హుషారులో ఉన్న శర్వానంద్.. ఇప్పుడు ఒకేసారి రెండు సినిమాల షూటింగ్స్ ను ప్రారంభించేందుకు రెడీ అయిపోతున్నాడు.
సుధీర్ వర్మతో ఓ చిత్రానికి కమిట్ అయిన శర్వానంద్.. హను రాఘవపూడితో కూడా మరో సినిమా చేసేయనున్నాడు. ఈ రెండు సినిమా షూటింగ్స్ ను ఒకేసారి షూటింగ్ చేయాలని కూడా ఫిక్స్ అయిపోవడం విశేషం. వీటిలో దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించనున్న చిత్రం.. ఎక్కువగా నేపాల్ లో షూటింగ్ జరుపుకోనుందట. నితిన్ తో లై అంటూ యాక్షన్ జోనర్ లో సినిమా తీసిన ఈ దర్శకుడు.. శర్వాతో తీయనున్న చిత్రాన్ని కంప్లీట్ గా రొమాంటిక్ మూవీగా తెరకెక్కించనున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే బౌండ్ స్క్రిప్ట్ రెడీ అయిపోగా.. నేపాల్ షూటింగ్ కోసం త్వరలోనే యూనిట్ బయలుదేరనుంది.
టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ సాయిపల్లవి.. శర్వా-హనుల చిత్రంలో హీరోయిన్ గా నటించనుంది. ప్రస్తుతం నానితో ఎంసీఏ మూవీలో నటిస్తున్న ఈ భామ.. తెలుగులో నటించనున్న మూడో చిత్రం ఇది. కమర్షియల్ ఫార్ములాకి దూరంగా.. రొమాంటిక్ జోనర్ లోనే రూపొందనున్న ఈ మూవీ స్క్రిప్ట్ సూపర్బ్ గా వచ్చిందనే టాక్ వినిపిస్తోంది.