Begin typing your search above and press return to search.
బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతున్న శర్వానంద్
By: Tupaki Desk | 20 Jan 2017 1:48 PM GMTవరుసగా రెండో సంవత్సరం కూడా సంక్రాంతి బరిలో నిలిచి.. గెలిచాడు శర్వానంద్. ఈ ఏడాది సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు ఉన్నాసరే.. వాటి తరువాత మూడో చిత్రంగా విడుదలైంది శతమానం భవతి. ఫ్యామిలీ ఎంటర్ టెయినర్ గా కుటుంబ ప్రేక్షకులకు చేరువైంది. బాలయ్య 100వ చిత్రం - చిరంజీవి 150వ చిత్రాల తరువాత విడుదలైనా... బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతున్నాడు శర్వానంద్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం కలెక్షన్లు స్టడీగా ఉన్నాయని ట్రేడ్ రిపోర్ట్ చెబుతోంది. తొలివారంలోనే ఆంధ్రా తెలంగాణల్లో రూ. 12.59 కోట్లను రాబట్టింది. అమెరికాలో అర్ధ మిలియన్ డాలర్ల కలెన్షన్లు సొంతం చేసుకుంది. ప్రాంతాల వారీగా ఈ చిత్రం వసూళ్లు వివరాలు ఇవిగో...
నైజాం - రూ. 4. 45 కోట్లు
సీడెడ్ - రూ. 1. 60 కోట్లు
నెల్లూరు - రూ. 0.32 కోట్లు
కృష్ణా - రూ. 0.83 కోట్లు
గుంటూరు - రూ. 0.95 కోట్లు
వైజాగ్ - రూ. 2.49 కోట్లు
ఈస్ట్ - రూ. 1.63 కోట్లు
వెస్ట్ - రూ. 1.14 కోట్లు
ఒవర్సీస్ ఇతర ప్రాంతాలు - రూ. 2.5 కోట్లు
రెండు తెలుగు రాష్ట్రాల కలెక్షన్లు - రూ. 16.05 కోట్లు
కుటుంబ కథా చిత్రం కావడం, ముఖ్యంగా పండుగ వాతావారణాన్ని అద్దం పట్టే సన్నివేశాలతో నిండి ఉండటం, ఆత్మీయతలూ అనురాగాల మేళవింపుతోపాటు చక్కని ప్రేమకథ కూడా ఉండటంతో... అటు కుటుంబ ప్రేక్షకులనూ ఇటు యూత్ ని ఈ చిత్రం బాగానే అలరిస్తోంది. ఈ వసూళ్లు మరికొద్ది రోజులు స్టడీగా ఉంటే మంచి లాభాలు ఆర్జించడం ఖాయం. ఈ చిత్ర నిర్మాణ వ్యయం రూ. 10 కోట్లు అని చెబుతున్నారు. ఆ లెక్కన ఇప్పటికే ఈ సినిమా లాభాల బాటపట్టేసినట్టు లెక్క.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/