Begin typing your search above and press return to search.

శ‌త‌మానం.. వాటే బ్లాక్ బ‌స్ట‌ర్‌

By:  Tupaki Desk   |   6 March 2017 5:28 PM GMT
శ‌త‌మానం.. వాటే బ్లాక్ బ‌స్ట‌ర్‌
X
ఎట్ట‌కేల‌కు ‘శ‌త‌మానం భ‌వ‌తి’ థియేట్రిక‌ల్ ర‌న్ ముగిసింది. సంక్రాంతికి ‘ఖైదీ నెంబ‌ర్ 150’.. ‘గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి’ లాంటి భారీ సినిమాల మ‌ధ్య త‌క్కువ అంచ‌నాల‌తో విడుద‌లైన ఈ సినిమా.. ఇంతింతై అన్న‌ట్లుగా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దూసుకెళ్లి వ‌సూళ్ల వ‌ర్షం కురిపించింది. అంచ‌నాల‌కు అంద‌ని రీతిలో ఏకంగా రూ.33.3 కోట్ల షేర్.. రూ.53.5 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసి ట్రేడ్ పండిట్ల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. తెలుగు రాష్ట్రాల వ‌ర‌కే ఈ సినిమా రూ.29.6 కోట్ల షేర్.. రూ.43.9 కోట్ల గ్రాస్ వ‌సూలు చేయ‌డం విశేషం. పెట్టుబ‌డి మీద ఈ చిత్రం దాదాపు మూడు రెట్ల షేర్ రాబ‌ట్ట‌డం మ‌రో విశేషం.

ఫుల్ ర‌న్లో ఏరియాల వారీగా ‘శ‌త‌మానం భ‌వ‌తి’ వ‌ర‌ల్డ్ వైడ్ షేర్స్ వివ‌రాలు..

నైజాం-రూ.11 కోట్లు

డెడ్‌-రూ.3 కోట్లు

వైజాగ్ (ఉత్త‌రాంధ్ర‌)-రూ.5.25 కోట్లు

గుంటూరు-రూ.2 కోట్లు

కృష్ణా- రూ.1.95 కోట్లు

ప‌శ్చిమ‌గోదావ‌రి-రూ.2.05 కోట్లు

తూర్పు గోదావ‌రి-రూ.3.5 కోట్లు

నెల్లూరు-రూ.75 లక్షలు

క‌ర్ణాట‌క‌-రూ.1.3 కోట్లు

యుఎస్‌- రూ.2.1 కోట్లు

ఏపీ-తెలంగాణ షేర్- రూ.29.6 కోట్లు

ఏపీ-తెలంగాణ గ్రాస్‌- రూ.43.9 కోట్లు

వ‌ర‌ల్డ్ వైడ్ షేర్- రూ.33.3 కోట్లు

వ‌ర‌ల్డ్ వైడ్ గ్రాస్‌-53.5 కోట్లు

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/