Begin typing your search above and press return to search.

క్వీన్ కి అండ‌గా మాఫియాపై చెల‌రేగిన‌ షాట్ గ‌న్

By:  Tupaki Desk   |   25 July 2020 11:30 AM GMT
క్వీన్ కి అండ‌గా మాఫియాపై చెల‌రేగిన‌ షాట్ గ‌న్
X
యువ‌హీరో సుశాంత్ సింగ్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం ఎన్నో ప్ర‌శ్న‌ల్ని లేవ‌నెత్తింది. ముఖ్యంగా బాలీవుడ్ మాఫియాపై విస్త్ర‌త‌మైన చ‌ర్చ‌కు దారి తీసింది. సుశాంత్ సింగ్ కి మ‌ద్ధ‌తునిచ్చిన వారిలో క్వీన్ కంగ‌న పేరు మార్మోగింది. కంగనా రనౌత్ ‌కు వ్యతిరేకంగా మాట్లాడే ఒక సెక్ష‌న్ ఆమె విజయానికి అసూయపడుతున్నారని తాజాగా వెట‌ర‌న్ న‌టుడు షాట్ గ‌న్ శ‌త్రుఘ్న‌ సిన్హా చేసిన వ్యాఖ్య సంచ‌ల‌నంగా మారింది.

బాలీవుడ్ లోని కొంద‌రు పెద్ద‌ల ముఠాగా ఏర్ప‌డి ప్రతిభావంతులైన బయటివారిని ఎలా తొక్కేస్తున్నారో కంగ‌న మాట్లాడుతోంది. దీనికి షాట్ గ‌న్ మ‌ద్ధ‌తునివ్వ‌డం వేడెక్కిస్తోంది. ఇంత‌కీ ఆయ‌న ఏమ‌న్నారు? అంటే.. కంగ‌న‌ను చూసి అసూయ చెందేవాళ్లే త‌న‌ను వ్య‌తిరేకిస్తున్నార‌ని వ్య‌తిరేకంగా మాట్లాడుతున్నార‌ని అన్నారు. అంతేకాదు.. చాలామందితో పోలిస్తే కంగ‌న బాలీవుడ్ మాఫియాని ఎదిరించ‌డంలో ఘ‌న‌విజ‌యం సాధించింద‌ని ఎంతో దూరం వెళ్లింద‌ని కూడా ఆయ‌న ప్ర‌శంస‌లు కురిపించారు. ప‌రిశ్ర‌మ ఇన్ సైడ‌ర్స్ కంగ‌న‌పై ఎంతో అసూయ‌తో ఉన్నార‌ని ఆయ‌న అన్నారు. కంగ‌న విజ‌యం ధైర్యంపైనా అంతా చిరాకుతో అసూయ‌తో ఉన్నార‌ని ఉటంకించారు.

``మన దయ లేకుండా.. మన సంకల్పం లేకుండా.. మా సమూహాలలో చేరకుండా లేదా మన నుండి ఎటువంటి ఆశీర్వాదం లేకుండా.. ఈ అమ్మాయి చాలా దూరం వెళ్లి.. చాలా సాధించింది. ఆమె విజయం ధైర్యం గురించి వారు చిరాకు మరియు అసూయతో ఉన్నారు`` అంటూ స్వాభిమానంపై మాట్లాడారు శ‌త్రుఘ్న సిన్హా. మ‌న అని ఆయ‌న బాలీవుడ్ కుటుంబాల్లో తాను ఒక‌రిని అని చెప్పేందుకు వెన‌కాడ‌లేదు.

జూన్ 14 న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకుని మరణించిన తరువాత కంగనా చిత్ర పరిశ్రమలో స్వపక్షం అభిమానవాదం గురించి ఏకి ప‌డేస్తోంది. సోషల్ మీడియాలో శ‌త్రుఘ్న సిన్హా కుమార్తె అయిన సోనాక్షి సిన్హాను ప‌లువురు టార్గెట్ చేశారు. అయినా ఆయ‌న కంగ‌న‌కు మ‌ద్ధ‌తునివ్వ‌డం షాకిస్తోంది.

కరణ్ జోహార్ చాట్ షో పైనా షాట్ గ‌న్ సెటైర్లు వేశారు. మా టైమ్ లో అర్జున్ ‌తో కాఫీ లేదు. ఈ రకమైన ప్రణాళికాబద్ధమైన సంఘటనలు వివాదాలకు కారణమవుతున్నాయి. ప్రస్తుతం కంగ‌న‌ను వ్య‌తిరేకించే వాళ్లు ఇండ‌స్ట్రీ లోప‌లి సమాజంలోని సభ్యులు అని సిన్హా వ్యాఖ్యానించారు. కానీ సినీ పరిశ్రమ ఒక వ్యక్తికి చెందినది కాదు. ఈ వ్యక్తిని బహిష్కరిద్దాం లేదా ఈ వ్యక్తిని పరిశ్రమ నుండి తొలగించండి అని ఎవరైనా అన‌డం నేరం. అలా చెప్పడానికి మీరు ఎవరు? మీరు పరిశ్రమలోకి ఎలా ప్రవేశించారు? మీరు జీవితంలో ఏం సాధించేశార‌ని? అంటూ ఇన్ సైడ‌ర్స్ మాఫియాని ఆయ‌న వ్య‌తిరేకించ‌డం క‌ల్లోలం రేపుతోంది. ఇక ప‌రిశ్ర‌మ ఇన్ సైడ‌ర్స్ అయిన చాలామందిపై సిన్హాజీ ప‌లు మార్లు వ్య‌తిరేక‌త‌ను క‌న‌బ‌రిచిన సంగ‌తి విధిత‌మే. ప‌రిశ్ర‌మ వెలుప‌లి నుంచి వ‌చ్చి విజ‌యం సాధిస్తున్న కంగ‌న‌ను ఆయ‌న వెన‌కేసుకు రావ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది.