Begin typing your search above and press return to search.
'మహానటి' తీయడం నాకు నచ్చలేదు
By: Tupaki Desk | 16 May 2019 2:32 PM GMTతెలుగు సినిమా బతికి ఉన్నంత కాలం ఉండే నటి హీరోయిన్ సావిత్రి. అద్బుతమైన పాత్రల్లో నటించి మహానటిగా పేరు దక్కించుకున్న ఆమె జీవితంలో కొన్ని చేదు సంఘటనలు కూడా ఉన్నాయి. ఆకాశం అంత ఎత్తుకు ఎదిగిన ఆమె పాతాలంకు పడిపోవడం కూడా జరిగింది. ఆమె స్టార్ డంను చూసిన వారే, ఆమె పతనంను కూడా చూశారు. మహానటి జీవితం సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరికి ఒక పాఠం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే మహానటి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.
సావిత్రి గారు ఎంతటి గుర్తింపును దక్కించుకున్నారో 'మహానటి' కూడా అంతటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఎన్నో అవార్డులను దక్కించుకోవడంతో పాటు, జాతీయ స్థాయిలో కూడా సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అంతటి విజయాన్ని దక్కించుకున్న మహానటి చిత్రం గురించి సీనియర్ హీరోయిన్ సావిత్రి గారికి అప్పట్లో సమ ఉజ్జి అయిన షావుకారు జానకి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆలీతో జాలీగా టాక్ షో లో పాల్గొన్న షావుకారు జానకి గారు మాట్లాడుతూ సావిత్రి జీవితంను మహానటిగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం నాకు నచ్చలేదు - ఆమె బయోపిక్ ను తీయకుండా ఉండాల్సిందన్నారు.
నేను 'మహానటి' చిత్రానిన చూడలేదు, కాని సినిమాలో ఆమె గురించి బాధకరమైన విషయాలు చూపించారని తెలిసింది. ఆ సీన్స్ చూపించారని తెలిసి బాధ కలిగింది. నా మాటలు కొందరికి కఠువుగా ఉండవచ్చు, కాని నా వరకు నేను మహానటి చిత్రంను తీయడంను తప్పుడు నిర్ణయంగానే భావిస్తున్నాను అన్నారు. సినిమా మరియు జీవితం అనేవి పూర్తిగా వేరు. సావిత్రి పూర్తి జీవితంను సినిమాలో చూపించడం నేను జీర్ణించుకోలేక పోతున్నాను అంటూ ఈ సందర్బంగా షావుకారు జానకిగారు అన్నారు.