Begin typing your search above and press return to search.

ఇప్పటి వరకూ తనకంటే చిన్నోడి తో డేట్ కు వెళ్ల లేదట

By:  Tupaki Desk   |   27 Dec 2019 10:37 AM GMT
ఇప్పటి వరకూ తనకంటే చిన్నోడి తో డేట్ కు వెళ్ల లేదట
X
హీరోయిన్ క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయా? అంటే పెద్దగా కనిపించవు. కానీ.. కలల రాణిలా.. రస సుందరిలా మనసును విడవకుండా వెంటపడే ఆకర్షణ ఆమె సొంతం. ఆంటీ అయినప్పటికీ గ్లామర్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని రీతిలో వెండితెర మీద చెలరేగిపోవటం రాధికా ఆప్టేకు అలవాటే. నటించే విషయంలో అస్సలు మొహమాటం పడటం తెలీని ఈ బ్యూటీ దగ్గర యేషాలేస్తే.. చెక్కుతీస్తుంది కూడా.

ఏదైనా నచ్చిందే చేయాలి.. నచ్చనిది.. ఎవరి ఒత్తిడితోనో.. ఇంకేదైనా ప్రయోగిస్తే.. నో అంటే నో చెప్పేయటమే కాదు.. వారి తాట తీసేందుకు సైతం వెనుకాడని ధైర్యం ఆమె సొంతం. తరచూ వార్తల్లో నిలిచే ఆమె అటు బాలీవుడ్ సినిమాల్లోనూ.. ఇటు టాలీవుడ్ లో అప్పుడప్పుడు కనిపిస్తున్నా.. ఇప్పుడు ఫోకస్ మొత్తం వెబ్ సిరీస్ మీదనే అన్నట్లు వ్యవహరిస్తోంది.

ఇటీవల నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమయ్యే కార్యక్రమానికి అతిధిగా హాజరైన ఆమె.. ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు. వయసులో తనకంటే చిన్నవ్యక్తితో ఇప్పటి వరకూ డేట్ కు వెళ్ల లేదని క్లారిటీ గా చెప్పుకొచ్చింది. గతంలో తనను ఒకే సమయంలో ఇద్దరు అబ్బాయిలు డేట్ కు రమ్మన్నారని.. అందులో ఒకతను తన కంటే చిన్నవాడని చెప్పింది. ఒకే సమయంలో తనతో డేట్ కు రమ్మన్న ఇద్దరిలో ఎవరితో డేట్ కు వెళ్లాలన్న విషయంలో ఆమె ఎలా నిర్ణయం తీసుకున్నారో తెలిస్తే అవాక్కు అవ్వాల్సింది.
దీనికి సంబంధించి రాధికా ఆప్టే మాటల్లోనే చూస్తే.. ఒకే టైంలో ఇద్దరూ డేట్ కు రమ్మన్నారు. ఏం చేయాలో తోచలేదు. అప్పట్లో మా ఇంట్లో రోజూ ఒక పిల్లి వచ్చేది. దానికి ఓ చేపను ఫుడ్ గా పెట్టేదాన్ని. వాళ్లు అడిగిన రోజున పిల్లి కి చేపను ఆహారం గా పెట్టా. చేపను పిల్లి తింటే ఒక అబ్బాయి తో.. తినకంటే నా కంటే చిన్నోడి తో డేట్ కు వెళ్లాలని డిసైడ్ అయ్యా.

పిల్లి చేపను తినటం తో చిన్నోడి తో తాను డేట్ కు వెళ్లలేదని చెప్పింది. డేట్ కు వెళ్లిన అబ్బాయినే తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకున్నానని.. అతడే తన భర్త అంటూ ఆమె నటించే వెబ్ సిరీస్ ల మాదిరే తన పెళ్లి ముచ్చటను సరికొత్త ఫ్లాట్ తో చెప్పింది. అందంతో ఆకర్షించటమే కాదు.. మర్చిపోలేని రీతిలో మాటలు చెప్పటంలోనూ రాధికాకు సాటి వచ్చే వారెవరూ ఉండరేమో?