Begin typing your search above and press return to search.

'షా'తో భేటీ తర్వాత తారక్ మూవీలో చేసేందుకు ఆమె రెఢీ?

By:  Tupaki Desk   |   7 Sep 2022 4:36 AM GMT
షాతో భేటీ తర్వాత తారక్ మూవీలో చేసేందుకు ఆమె రెఢీ?
X
కొన్ని పరిణామాలు అనూహ్యంగా చోటు చేసుకుంటూ ఉంటాయి. నిజానికి ఏ మాత్రం సంబంధం లేనట్లు కనిపించినా.. అందుకు భిన్నంగా పరిస్థితులు అప్పుడప్పుడు చోటు చేసుకోవటం కనిపిస్తుంటుంది. సుదీర్ఘ విరామం తర్వాత సరిలేరు నీకెవ్వరు మూవీలో మెరిసిన లేడీ అమితాబ్ విజయశాంతి.. ఆ తర్వాత సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపలేదు. దీనికి బోలెడెన్ని కారణాలు ఉన్నట్లు చెబుతారు.

సరిలేరు నీకెవ్వరు మూవీ టైంలోనే తాను సినిమాలు చేసేందుకు పెద్ద ఆసక్తి లేదని.. ప్రజాసేవకే తన మనసును పూర్తి స్థాయిలో లగ్నం చేయబోతున్నట్లుగా ఆమె పేర్కొన్నారు. తన పాత్ర హుందాగా ఉండి.. కథ కూడా నచ్చితే మాత్రం తాను నటించాలా? వద్దా? అన్న విషయాన్ని ఆలోచిస్తున్నట్లుగా రాములమ్మ పేర్కొన్నారు. ఆమె చెప్పినట్లే.. తర్వాత పలు ఆఫర్లు వచ్చినా ఆమె మాత్రం ఎస్ చెప్పలేదు.

ఇదిలా ఉంటే తాజాగా తారక్ తో కొరటాల శివ దర్శకత్వంలో ఒక మూవీని ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన కసరత్తు జరుగుతోంది. ఈ మధ్యనే ఆయన డైరెక్షన్ లో వచ్చిన ఆచార్య మూవీ రిజల్ట్ తారక్ మూవీ మీద ప్రభావం పడినట్లుగా చెబుతుననారు.

ఈ మధ్యనే స్క్రిప్టు వర్కు పూర్తిచేసిన కొరటాల.. పాత్రలకు తగ్గట్లుగా నటీనటుల్నిఎంపిక చేసే అంశంపై ఫోకస్ పెట్టినట్లుగాచెబుతున్నారు.ఈ మూవీలో ఒక పాత్రకు విజయశాంతి అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది.

అయితే.. ఆమె ఈ రోల్ చేసేందుకు ఎలా రియాక్టు అవుతారు? అన్నది ప్రశ్నగా మారింది. ఇటీవల తెలంగాణకు వచ్చిన సందర్భంగా తారక్ ను ప్రత్యేకంగా భేటీకి పిలిపించిన వైనం తెలిసిందే. ఈ పరిణామంతో రాములమ్మ కూడా సానుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు.

కొరటాల తాజా మూవీలో విజయశాంతి పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటుందని చెబుతున్నారు.అందుకే ఆమె ఓకే చెప్పినట్లు చెబుతున్నారు.. అమిత్ షాతో తారక్ భేటీ తర్వాతే.. ఈ కాంబినేషన్ ఓకే అయినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ అదే నిజమైతే.. తారక్ అభిమానులకు అంతకు మించిన ఆనందం ఇంకేం ఉంటుంది?


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.