Begin typing your search above and press return to search.

న‌టి సూసైడ్ కి ప్రియుడే కార‌కుడు!

By:  Tupaki Desk   |   27 Dec 2022 1:50 AM GMT
న‌టి సూసైడ్ కి ప్రియుడే కార‌కుడు!
X
హిందీ టీవీ న‌టి టునీషా శ‌ర్మ ఆత్మ‌హ‌త్య సంచ‌ల‌న‌మైన సంగ‌తి తెలిసిందే. టునీషా ఏకంగా షూటింగ్ స్పాట్ లోనే ఫ్యాన్ కి ఊరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం అంద‌ర్నీ విస్మ‌యానికి గురి చేసింది. 20 ఏళ్ల వ‌య‌సు..కెరీర్ లో ఎదుగుతోన ద‌శ‌లో ఇలాంటి నిర్ణ‌యం ఏంట‌ని బాలీవుడ్ అంతా షాక్ అయింది. దీంతో అస‌లు ఏం జ‌రిగి ఉంటుంద‌ని పోలీసుల కోణంలో విచార‌ణ సాగుతోంది. ఈ నేప‌థ్యంలో ర‌క‌ర‌కాల సందేహాలు తెర‌పైకి వ‌స్తున్నాయి.

తాజాగా పోలీసుల అదుపులో ఉన్న టునీషా బోయ్ ప్రెండ్ షీజ‌న్ ఖాన్ నుంచి ఆత్మ‌హ‌త్యకు గ‌ల కార‌ణాలు రాబ‌ట్టిన‌ట్లు తెలుస్తోంది. టునీషాకి బ‌ల‌వంతంగా బ్రేక‌ప్ చెప్ప‌డం వ‌ల్లే ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది.

ముఖ్యంగా శ్ర‌ద్ధా వాక‌ర్ హ‌త్య త‌ర్వాత త‌న నిర్ణ‌యం మార్చుకున్న‌ట్లు వెల్ల‌డించాడు. ఇద్ద‌రి మ‌ధ్య ఎనిమిదేళ్లు వ‌య‌సు వ్య‌త్యాసం ఉండ‌టం... కులాలు వేరు కావ‌డంతో ఆటంకాలు త‌ప్ప‌వ‌ని భావించి అక్క‌డితో ఆ బంధాన్ని వ‌దిలేయాల‌ని నిర్ణ‌యించుకుని బ్రేక‌ప్ చెప్పిన‌ట్లు తెలిపాడు.

దీంతో కేసులో కీల‌క వ్య‌క్తిగా షీజ‌న్ ఖాన్ నిలిచాడు. బ్రేక‌ప్ ని త‌ట్టుకోలేక మ‌న‌స్తాపానికి గురై టునీషా ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌టానికి ఆరు గంట‌ల ముందు టునీషా మ్యాక‌ప్తో ఉన్న ఫోటోను ఇన్ స్టాలో షేర్ చేసిన సంగ‌తి తెలిసిందే.

అందులో ఆమె చాలా స‌హ‌జంగానే ఎలాంటి వేద‌న‌కు గురైన‌ట్లు క‌నిపించ‌లేదు. ఆత్మహ‌త్య చేసుకోవాల‌నుకున్న అమ్మాయి ఎందుకు ఇన్ స్టాలో ఇలాంటి ఫోటో పెడుతుంది? అన్న ప్ర‌శ్న‌కు ఎట్ట‌కేల‌కు చిక్కు ముడి వీడింది.

టునీషా త‌ల్లి అనుమానం నిజ‌మైంది. ప్రియుడు షీజాన్ ఖాన్ కార‌ణంగానే ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు ఆమె పిర్యాదులో పూర్కొన్నారు. ఆ ఫిర్యాదు ఆధారంగానే పోలీసులు విచార‌ణ చేప‌ట్టి నిగ్గు తేల్చిన‌ట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో ఈ త‌ర‌హా ఆత్మ‌హ‌త్య‌లు కొద్ది కాలంగా త‌ర‌చూ వెలుగులోకి వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.