Begin typing your search above and press return to search.

ల‌క్కీ ఛాన్స్‌: 'ఆషిఖి 3'లో బిగ్ బాస్ బ్యూటీ

By:  Tupaki Desk   |   8 Sep 2022 12:30 PM GMT
ల‌క్కీ ఛాన్స్‌: ఆషిఖి 3లో బిగ్ బాస్ బ్యూటీ
X
ప్రేమ‌క‌థా చిత్రాల్లో ఆషిఖి - ఆషిఖి 2 ట్రెండ్ సెట్ట‌ర్స్ గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఆషిఖి 2లో అవ‌కాశం అందుకోవ‌డం వ‌ల్ల‌నే శ్ర‌ద్ధా క‌పూర్ పేరు మార్మోగింది. ప్ర‌స్తుతం ఆషిఖి 3 చిత్రీక‌ర‌ణ‌కు రంగం సిద్ధ‌మ‌వుతోంది. ఇందులో హీరోయిన్ ఎవ‌రో ఆరాలు ఎక్కువ‌య్యాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం... ఇందులో బిగ్ బాస్ ఫేం షెహ‌నాజ్ గిల్ క‌థానాయిక‌గా న‌టించ‌నుంద‌ని ప్ర‌చారం సాగుతోంది. దేశంలోని పాపుల‌ర్ హీరోయిన్ల కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న నటి షెహనాజ్ గిల్. బిగ్ బాస్ స్టింట్ లో సిద్ధార్థ్ శుక్లాతో ఎఫైర్ త‌న‌కు పెద్ద పేరు తెచ్చిపెట్టాయి.

ప్ర‌స్తుతం ఈ బ్యూటీ సల్మాన్ ఖాన్ చిత్రం 'భాయిజాన్'లో న‌టించ‌డంతో హాట్ టాపిక్ గా మారింది. గత కొన్ని రోజులుగా ఆషిఖి 3 గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా షెహనాజ్ ఎంపికైంద‌ని వార్తలు వస్తున్నాయి.

ఈ చిత్రంలో కార్తీక్ అరీనా ప్రధాన పాత్రలో నటించనున్నారు. షెహనాజ్ గురించిన ఈ వార్త కొద్దికాలంలోనే హాట్ టాపిక్ గా మారింది. అయితే హీరోయిన్ ను ఇంకా లాక్ చేయలేదని నిర్మాతలు- టి సిరీస్ ప్ర‌తినిధుల నుంచి వార్తలు గుప్పుమంటున్నాయి.

ఎనిమిదేళ్ల ఆషిఖి 2 ఒక సంచ‌ల‌నం

ది గ్రేట్ క‌ల్ట్ ల‌వ్ స్టోరి 'ఆషిఖి 2' రిలీజై 8 సంవత్సరాలు పూర్త‌యింది. శ్రద్ధా కపూర్- ఆదిత్య రాయ్ కపూర్ జంట‌గా న‌టించిన గొప్ప ప్రేమ‌క‌థా చిత్రంగా ఆషిఖి 2 సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఆషిఖి 2 క‌థాంశం ఆస‌క్తిక‌రం. తాగుడుకు బానిసైన‌ గాయకుడు రాహుల్ జయకర్ ఔత్సాహిక గాయని అరోహి కేశవ్ షిర్కే మధ్య రొమాంటిక్ ల‌వ్ స్టోరి ఆద్యంతం ర‌క్తి క‌ట్టిస్తుంది. ల‌వ్ నేప‌థ్యంలో మ్యూజిక‌ల్ ల‌వ్ స్టోరిగా ఇది యువ‌త‌రం మ‌న‌సులు దోచింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వాణిజ్యపరంగా విజయవంతమైంది. 2013 లో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రం ఇటీవ‌లే 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

నాజర్ కే సమనే.. రొమాంటిక్ క్లాసిక్ డ్రామా 'ఆషిఖి' నుంచి హృద‌యాల్ని బ‌రువెక్కించే పాట‌గా ఇప్పటికీ ప్రజల మనస్సులలో తాజాగా ఉంది. ఈ చిత్రం 90 లలో భారీ విజయాన్ని సాధించింది. అందులో పాటలు కూడా చార్ట్ బ‌స్ట‌ర్స్ గా నిలిచాయి. ఆపై 2013 లో మోహిత్ సూరి ఈ సినిమాని రీమేక్ చేశారు. ఆదిత్య రాయ్ కపూర్ - శ్రద్ధా కపూర్ నటించిన ఆషికి 2 హిట్ అయ్యాక ఓవ‌ర్ నైట్ ఈ జంట‌కు బాలీవుడ్ లో పాపులారిటీ పెరిగింది.

ముఖేష్ భట్ -భూషణ్ కుమార్ నిర్మించిన ఆషిఖి 2.. 1954 లో వ‌చ్చిన 'రొమాన్స్ ఎ స్టార్ ఈజ్ బోర్న్' అనే చిత్రానికి రీమేక్. శ్ర‌ద్ధాకు ఇది తొలి సినిమా కాక‌పోయినా.. త‌న‌కు మొదటి హిట్ చిత్రం అనే చెప్పాలి. 2010 లో తీన్ ప‌త్తి అనే చిత్రంతో కెరీర్ ప్రారంభించిన శ్ర‌ద్ధా.. అనంత‌ర కాలంలో ఆషిఖి 2తో పాటు.. బాలీవుడ్ లో ప‌లు బ్లాక్ బ‌స్ట‌ర్లలో న‌టించింది. ఆషిఖి 3 న‌టీన‌టులు కార్తీక్ అరీనా - షెహ‌నాజ్ గిల్ కి కూడా మంచి పేరొస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.