Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్ : అల.. కాపీ చేశారు కానీ సోల్ ని మరిచారు!
By: Tupaki Desk | 12 Jan 2023 11:21 AM GMTఅల్లు అర్జున్ నటించిన ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ మూవీ 'అల వైకుంఠపురములో'. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ బన్నీ కెరీర్ లో తొలి ఇండస్ట్రీగా నిలవడమే కాకుండా ఫ్లాపుల్లో వున్న తనకు బ్లాక్ బస్టర్ ని అందించిన మళ్లీ ట్రాక్ లోకి తీసుకొచ్చింది. ఈ మూవీకి తమన్ అందించిన ఆడియో సాంగ్స్ సంగీత ప్రియులకు ఆల్ టైమ్ ఫేవరేట్ గా నిలిచి యూట్యూబ్ లో వందల మిలియన్ ల వ్యూస్ ని రాబట్టి రికార్డులు సృష్టించాయి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ మూవీని హిందీలో 'షెహజాదా' పేరుతో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.
కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించిన ఈ మూవీకి రోహిత్ ధావన్ దర్శకత్వం వహిస్తున్నాడు. టి సిరీస్ అధినేతలు భూషన్ కుమార్, క్రిషన్ కుమార్ లతో కలిసి అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ, హీరో కార్తీక్ ఆర్యన్ నిర్మిస్తున్నారు. క్రితి సనన్, మానిషా కోయిరాలా, పరేష్ రావెల్, రోనిత్‌రాయ్, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రామాలు జరుపుకుంటోంది.
అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని ఫిబ్రవరి 10న విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం గురువారం ఈ మూవీ ట్రైలర్ ని విడుదల చేసింది. ప్రతీ సీన్, డైలాగ్, క్యారెక్టర్స్ నేమ్స్.. ఎవ్రీథింగ్ మక్కీటూ మక్కీ దించేసి ఈ మూవీని 'అల వైకుంఠపురములో'కు కాపీగా చేశారే కానీ సోల్ ని మాత్రం మరిచారు.
హిందీ రీమేక్ లోకి దర్శకుడు రోహిత్ ధావన్ ట్రాన్స్ ఫార్మ్ చేచేయలేకపోయాడని పలు సీన్స్‌ని చూస్తే అర్థమవుతోంది. తెలుగులో టబు పోషించిన తల్లి పాత్రని హిందీలో మనీషా కోయిరాలతో చేయించారు.
మరీ ముఖ్యంగా తెలుగులో ఓ రేంజ్ లో ఎంటర్ టైన్ చేసిన ఆఫీస్ సీన్ ఇక్కడ మాత్రం తేలిపోయింది. ఇక తెలుగులో నటించిన మురళీశర్మ క్యారెక్టర్ ని పరేష్ రావెల్ ఓ రేంజ్ లో ఆడేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక జయరామ్ పాత్రలో రోనిత్ రాయ్, ఇక తాత పాత్ర కోసం మాత్రం సచిన్ ఖేడేకర్ నే తీసుకున్నారు. ఇక సముద్రఖని క్యారెక్టర్ కోసం సన్నీ హిందుజా ని తీసుకున్నారు. పరేష్ రావెల్, కార్తీక్ ఆర్యన్ మధ్య వచ్చే సన్నివేశాలని యాజిటీజ్ గా వాడేశారు.
తెలుగులో వున్న భావోద్వేగాలు ఆ స్థాయిలో రీమేక్ లో పండలేదనిపిస్తోంది. ఇక తెలుగు సినిమాకు ప్రాణంగా నిలిచిన సంగీతం రీమేక్ కు మైనస్ గా మారింది. సంగీతం ప్రీతమ్ ఏ విషయంలోనూ ఆ మ్యాజిక్ ని రిపీట్ చేయలేకపోయాడని ట్రైలర్ తో స్పష్టం అవుతోంది. ఇన్ని మైనస్ లతో వస్తున్న 'అల... రీమేక్ ఎలాంటి ఫలితాన్ని అందించనుందన్నది తెలియాలంటే ఫిబ్రవరి 10 వరకు వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.