Begin typing your search above and press return to search.

కొత్త వాళ్ల‌పై శేఖ‌ర్ క‌మ్ములా కామెంట్ ఇది!

By:  Tupaki Desk   |   22 Nov 2022 2:30 AM GMT
కొత్త వాళ్ల‌పై శేఖ‌ర్ క‌మ్ములా కామెంట్ ఇది!
X
పాత నీరు పోవాలి. కొత్త నీరు రావాలి అన్న‌ది ఎక్క‌డైనా స‌హ‌జమే. కానీ ఇండ‌స్ర్టీలో మాత్రం అలా జ‌ర‌గ‌డం చాలా రేర్. పాత వాళ్లే ఉంటారు. వాళ్లే ఏలాలి అన్న విధానం నుంచి ఇప్పుడిప్పుడే ప‌రిశ్ర‌మ బ‌య‌ట ప‌డుతుంది. ట్యాలెంట్ ఉన్న ప్ర‌తీ ఒక్కొక్క‌రుగా బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. ఒక‌ప్పుడు సినిమా ఒక్క‌టే ఆప్ష‌న్ గా క‌నిపించేది. నేడు ఓటీటీ వెబ్ సిరీస్ లు రావ‌డంతో సినిమానే చేయాలా. పెద్ద తెర‌పైనే క‌నిపించాలా? అనే స్థాయికి న‌వ‌తరం చేరింది.

ఏదో ఓ ప్లాట్ ఫాం పై నిరూపించుకుంటే అటుపై ప‌రిశ్ర‌మే వెతుక్కుని వ‌చ్చి మ‌రీ అవ‌కాశాలు క‌ల్పిస్తోంది. ఇన్నో వేటివ్ స్టోరీస్ ని కార్పోరేట్ కంపెనీలు స్వాగ‌తిస్తున్నాయి. ట్యాలెంట్ ఉన్న వారికి ఎర్ర తివాచీ వేసి మ‌రీ ఆహ్వానిస్తోంది. ఓ కొత్త‌కుర్రాడు ప‌దేళ్ల‌కు పైగా ఇండ‌స్ర్టీలో తిరుగుతున్నాడు. అలా చెప్పులు అరిగేలా తిరిగినా సినిమా ఛాన్స్ రాలేదు.

అలాగ‌ని నిరుత్సాహ ప‌డ‌లేదు. ప్ర‌య‌త్న లోపం లేకుండా శ్ర‌మించి స‌క్సెస్ అయ్యాడు. నేడు ఓ కార్పోరేట్ కంపెనీ నెట్ ప్లిక్స్ లోనే భారీ వ్య‌యంతో ఓవెబ్ సిరీస ని డైరెక్ట్ చేస్తున్నాడు. క‌ష్టే ఫ‌లి అన్న దానికి ఇప్పుడ‌త‌ను ఉదాహ‌ర‌ణ‌గా నిలిచాడు. తాజాగా స్టార్ మేక‌ర్ శేఖ‌ర్ క‌మ్ములా కొత్త వాళ్ల‌ని ఉద్దేశించి ఓ వేడుక‌లో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు.

ప‌రిశ్ర‌మ‌కి కొత్త వారు రావాలి. వాళ్ల‌తోనే కొత్త త‌ర‌హా క‌థ‌లు సాద్య‌మ‌వుతుంది. పాత వాళ్లు ఉంటే అదే క్రియేటిటీ క‌నిపిస్తుంది. జ‌న‌రేష‌న్ మారే కొద్ది కొత్త క‌థ‌ల‌కు అవ‌కాశం ఉంటుంది. త‌ద్వారా అప్ గ్రేడ్ అవుతుంది. ఆలోచ‌న స‌ర‌ళిలో చాలా మార్పులు క‌నిపిస్తాయి. అందుకే ప‌రిశ్ర‌మ కొత్త వారికి అవ‌కాశాలు క‌ల్పించాలి. ఇటీవ‌లే ఓ సినిమా క‌థ విన్నాను. రామ‌న్న యూత్ అనే క‌థ‌ని ద‌ర్శ‌కుడు వినిపించాడు.

ఆ లైన్ విన‌గానే స‌క్సెస్ య్యే స్టోరీ అనిపించింది. అందుకే ఈసినిమా ప్ర‌మోష‌న్ కి వ‌చ్చాను. నాయ‌కులు కోసం జెండాలు ఎత్తిన వాళ్లు ఏం అవుతారు అన్న‌ది ఈ సినిమా క‌థాంశం. ఇక్క‌డే ద‌ర్శ‌కుడు సక్సెస్ అయ్యాడు.

మ‌రి దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేసాడు అన్న‌ది చూడాలి. ఇక వ్య‌క్తిగ‌తంగా క‌మ్ములాకి పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ సినిమాలంటే ఎంతో ఆస‌క్తి. ఆయ‌న కెరీర్ ఆరంభంలో 'లీడ‌ర్' తెర‌కెక్కించి సంచ‌ల‌నాలు సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఒక్కసారిగా యావ‌త్ ఇండ‌స్ర్టీ క‌మ్ములా వైపు త‌ల తిప్పి చూసింది.H