Begin typing your search above and press return to search.
శేఖర్ కమ్ముల - ధనుష్ ప్రాజెక్ట్ ఊసే లేదేంటీ?
By: Tupaki Desk | 31 May 2022 5:20 AM GMTటాలీవుడ్ లో సమీకరణాలన్నీ మారిపోతున్నాయి. పెరిగిన మార్కెట్, బిడ్జెట్ లని దృష్టిలో పెట్టుకుని ప్రతీ హీరో భారీ ప్రాజెక్ట్ లపై కన్నేస్తున్నారు. బ్యాక్ టు డ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్రనల్ ఇస్తున్నారు. సీనియర్ స్టార్ హీరోల నుంచి యంగ్ స్టర్స్ వరకు ప్రతీ హీరో వరుస సినిమాలతో బిజీగా వుంటున్నారు. ఈ నేపథ్యంలో తమిళ హీరోలు కూడా మన మార్కెట్ పై కన్నేసిన విషయం తెలిసిందే. గతంలో మునుపెన్నడూ బై లింగ్వల్ మూవీస్ కి సిద్ధపడని క్రేజీ తమిళ హీరోలు ఇప్పడు తెలుగుతో పాటు తమిళంలోనూ బైలింగ్వల్ మూవీస్ కి రెడీ అయిపోతున్నారు.
ఇప్పటికే తెలుగులో ధనుష్, విజయ్, శివ కార్తీకేయన్ వంటి హీరోలు తెలుగులో బైలింగ్వల్ మూవీస్ కి శ్రీకారం చుట్టారు. త్వరలో మరో తమిళ హీరో కార్తి కూడా తెలుగులో బైలింగ్వల్ మూవీకి రెడీ అయిపోతున్నాడు. ధనుష్ హీరోగా యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి 'సార్' పేరుతో ఓ బైలింగ్వల్ మూవీని చేస్తున్న విసయం తెలిసిందే. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ గత రెండు నెలల క్రితమే మొదలైంది.
ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇక ఇటీవలే దళపతి విజయ్ హీరోగా మొదలైన బైలింగ్వల్ మూవీ షూటింగ్ కూడా జోరుగా సాగుతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ భారీ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇక మరో హీరో శివ కార్తీకేయన్ హీరోగానూ మరో బైలింగ్వల్ మూవీ ఇటీవలే చెన్నైలో ప్రారంభమైంది. 'జాతిరత్నాలు' ఫేమ్ ఆనంద్ కె.వి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇదిలా వుంటే త్వరలో కార్తి హీరోగా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఓ భారీ బైలింగ్వల్ మూవీని నిర్మించబోతున్నారు. అయితే వీటన్నింటికంటే ముందు ధనుష్ హీరోగా సెన్నిబుల్ మూవీస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఓ బైలింగ్వల్ మూవీని ప్రకటించారు. కానీ అది ఇంత వరకు పట్టాలెక్కలేదు. అసలు దీని గురించి మాట్లాడుకున్న వాళ్లే లేరు.
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పీ బ్యానర్ పై ఏషియన్ గ్రూప్స్ అధినేత నారాయణ్ దాస్ కె. నారంగ్. సుస్కూర్ రామ్మోహన్ రావు సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తామని అధికారికంగా గత ఏడాది ఆగస్టులో ప్రకటించారు. పీరియడిక్ డ్రామాగా ఈ మూవీని తెరపైకి తీసుకురావాలని శేఖర్ కమ్ముల ప్లాన్ చేశారు. ధనుష్ తో టీమ్ రెండు సార్లు సిట్టింగ్ కూడా వేసింది.
కానీ ఈ ప్రాజెక్ట్ తరువాత ప్రకటించిన బైలింగ్వల్ మూవీస్ షూటింగ్ చక చకా కంప్లీట్ చేసుకుంటుంటే ధనుష్ - శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్ మాత్రం ముందుకు సాగడం లేదు. దీని ఊసే ఎవరు ఎత్తడం లేదు. కారణం శేఖర్ కమ్ముల స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేయకపోవడమే నని తెలుస్తోంది. స్క్రిప్ట్ వర్క్ ని శేఖర్ కమ్ముల ఎప్పుడు పూర్తి చేస్తారో ధనుష్ ప్రాజెక్ట్ ని ఎప్పుడు పట్టాలెక్కిస్తారో అని అంతా ఎదురుచూస్తున్నారు.