Begin typing your search above and press return to search.
రాజమౌళి రూట్లో శేఖర్ కమ్ముల
By: Tupaki Desk | 27 April 2021 11:35 AM GMTశేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన 'లవ్ స్టోరీ' సినిమాను ఈ నెల 16న విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా ఉదృతి నేపథ్యంలో విడుదలను వాయిదా వేసారు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నేపధ్యంలో శేఖర్ కమ్ముల ఏం చేస్తున్నారు. కొత్త సినిమా స్క్రిప్టు రాసుకుంటున్నారా లేక ఏదైనా సినిమాలు చూస్తూ గడుపుతున్నారా...పుస్తకాలు చదువుతున్నారా..లేక ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారా అనేది సాధారణంగా వచ్చే సందేహం. అయితే మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు అవేమీ శేఖర్ కమ్ముల చేయటం లేదట. మరి ఏం చేస్తున్నారు అంటే..
సెన్సార్ అయ్యి.. రిలీజ్ కి నాలుగు రోజులు ముందు సినిమా ని పోస్ట్ పోన్ అయిన ఈ సినిమాని శేఖర్ కమ్ముల చెక్కే కార్యక్రమంలో ఉన్నారట. సాధారణంగా రాజమౌళి అలా చేస్తూంటారు. లాస్ట్ మినిట్ దాకా అందులో మాడిఫికేషన్స్ చేస్తూనే ఉంటారు. అందుకే ఆయన ఆ స్దాయిలో సక్సెస్ సాధిస్తున్నారు. శేఖర్ కమ్ముల కు కూడా సక్సెస్ రేటు ఎక్కువే. ఆయన ఇంకా లవ్ స్టోరీ మూడ్ లోంచి బయిటకు రాలేదట. దాంతో సినిమాని మరోసారి మొత్తం చూసి..కొంత లెంగ్త్ తగ్గించారట. దాదాపుగా ఓ పది నిమిషాల సినిమాని ట్రిమ్ చేసినట్టుగా వినపడుతోంది. ఇప్పుడు లవ్ స్టోరీ పర్ఫెక్ట్ గా ఉందనిపించిందట. సినిమా వాయిదా పడటంతో శేఖర్ కమ్ముల చక్కటి టైం దొరికిందని భావిస్తున్నారట.
ఇక 'లవ్ స్టోరీ' కథ విషయానికొస్తే.. ఫిదా తర్వాత మరోసారి తెలంగాణ నేపథ్యంలోనే ఈ చిత్రం తెరకెక్కిస్తున్నాడు శేఖర్ కమ్ముల. లవ్ స్టోరీ షూటింగ్ నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిపారు. అక్కడే ఎక్కువ శాతం షూటింగ్ చేసాడు దర్శకుడు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలు.