Begin typing your search above and press return to search.

'ఆర్ ఆర్ ఆర్' పై శేఖ‌ర్ క‌పూర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

By:  Tupaki Desk   |   13 Dec 2022 11:16 AM GMT
ఆర్ ఆర్ ఆర్ పై శేఖ‌ర్ క‌పూర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!
X
'ఆర్ ఆర్ ఆర్' చిత్రాన్ని అస్కార్ బ‌రిలో దించేదుకు రాజ‌మౌళి ఎంతలా శ్ర‌మిస్తున్నాడో చూస్తునే ఉన్నాం. భార‌త్ నుంచి నామినేట్ చేయ‌క‌పోయినా...జ‌న‌ర‌ల్ కేట‌గిరి విభాగంలో రేసులో దించి స‌క్సెస్ దిశ‌గా అడుగులేస్తున్నారు. ఆస్కార్ ముందు బ‌హుకరించే అవార్డులు అందుకుంటూ ఆస్కార్ పై అంచ‌నాలు అంత‌కంత‌కు పెంచేస్తున్నారు. ఈ అవార్డులు అందుకున్న వారంతా ఆస్కార్ అవార్డు విన్నర్ల‌గా నిలిచిన వారే.

దీంతో రాజ‌మౌళి ఆస్కార్ అందుకుంటాడ‌ని అభిమాను ఆశ‌లు రెట్టింపు అవుతున్నాయి. ఆర్ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్తో ఇండియాకి తిగిరి రావాల‌ని అభిమానులు స‌హా ప్రేక్ష‌కులంతా పూజ‌లు చేస్తున్నారు. ఇలా ఓవైపు రాజ‌మౌళి శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేస్తుంటే? మెచ్చుకోక పోగా ప‌నిగ‌ట్టుకుని విమ‌ర్శించే వాళ్లెంతో మంది. యుద్ధం చేత‌గాని వాడే ధ‌ర్మం గురించి మాట్లాడుతాడు అని ఓ సినిమాలో డైలాగ్ లా చేత‌గాని వాళ్లంతా ఆర్ ఆర్ ఆర్ ని ఎలా డీగ్రేడ్ చేయాలా ? అని కంక‌ణం క‌ట్టుకుని కూర్చున్నారు.

సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ఓ రాయి వేసి వెళ్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్...కోలీవుడ్ నుంచి కొంద‌రైతే ఆర్ ఆర్ ఆర్ విష‌యంలో కుచించ‌కుపోతున్న‌ట్లే క‌నిపిస్తుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా బాలీవుడ్ ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌పూర్ ఆర్ ఆర్ ఆర్ ని ఉద్దేశించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. బాలీవుడ్ విమ‌ర్శ‌కుల‌కు ఆయ‌న స‌మాధానం ఓ చెంపు పెట్టులా నిలిచింది.

'ఆర్ ఆర్ ఆర్' ని బెస్ట్ పిక్చ‌ర్స్ విభాగంలోనే అవార్డుకి ఎంపిక చేయాల‌ని..నాన్ ఇంగ్లీష్ విభాగంలో కాదని అభిప్రాయప‌డ్డారు. దీంతో కొంత మంది బాలీవుడ్ ఉద్దండులు నోట్లో ప‌చ్చి వెల‌క్కాయ ప‌డిన‌ట్లు అయింది. డైరెక్ట‌ర్ గా రాజ‌మౌళి ప‌నిత‌నాన్ని ప్ర‌శంసించ‌క‌పోయినా ఆర్ ఆర్ ఆర్ రూపంలో బ‌య‌ట పెట్టిన ఆయ‌న వ్యాఖ్య‌ల‌కు కొంత మందికి సౌండ్ లేదు. ప‌రోక్షంగా రాజ‌మౌళిని చూసి మ‌నోళ్లు కొంతైన నేర్చుకోవాల‌ని చెప్ప‌క‌నే చెప్పిన‌ట్లు అయింది. మ‌రి అమెరికాలో స్థిర‌ప‌డిన ఆ బాలీవుడ్ ఉద్దండుడు శేఖ‌ర్ క‌పూర్ వ్యాఖ్య‌ల‌పై ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.