Begin typing your search above and press return to search.

గ్రేట్ డైరెక్టర్ లవ్ లో పడిపోయాడు

By:  Tupaki Desk   |   26 July 2015 6:19 AM GMT
గ్రేట్ డైరెక్టర్ లవ్ లో పడిపోయాడు
X
శేఖర్ కపూర్.. భారత దేశం గర్వించదగ్గ దర్శకుడు. బాలీవుడ్ సినిమాలతో డైరెక్టర్ గా ప్రయాణం ఆరంభించి, హాలీవుడ్లోనూ మన జెండాను ఎగరవేసిన శేఖర్.. భారతీయ సినిమా మరింత ఎత్తుకు ఎదగాలని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాడు. మన సినిమాల్లో మంచి ప్రయత్నాలు జరిగినపుడల్లా ఆయన స్పందదిస్తారు. మొన్నా మధ్య బాహుబలి సినిమా ఆయన్ని స్పందింపజేసింది. ముంబయిలో రాజమౌళిలా సాహసోపేత సినిమాలు చేసే దర్శకుడెవరైనా ఉన్నారా అంటూ సవాలు విసిరారాయన. బాహుబలి తర్వాతి వారంలో వచ్చిన భజరంగి భాయిజాన్ కూడా శేఖర్ ను కదిలించింది.

‘‘భజరంగి భాయిజాన్ చూశాను. హిందీ సినిమాతో మరోసారి ప్రేమలో పడిపోయాను. సల్మాన్ ఖాన్, కబీర్ ఖాన్, నవాజుద్దీన్ సిద్దిఖిలకు కంగ్రాచులేషన్స్’’ అని ట్వీట్ చేశారు శేఖర్. సాధారణంగా సల్మాన్ ఖాన్ సినిమాలంటే శేఖర్ కు అస్సలు నచ్చవని అంటారు. రొటీన్ మాస్ మసాలా సినిమాల్ని ఆయన అస్సలు ఇష్టపడరు. సల్మాన్ సినిమాల గురించి ఎప్పుడూ ట్వీట్ చేయరు. ఐతే భజరంగి భాయిజాన్ మీద ఇలా ప్రశంసలు కురిపించారంటే.. ఆయనకు ఆ సినిమా ఎంతగా నచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క శేఖర్ మాత్రమే కాదు.. సల్మాన్ సినిమాల్ని వ్యతిరేకించే చాలామందిని ‘భజరంగి భాయిజాన్’ కట్టిపడేస్తోంది. ఇన్నాళ్లు తానెంత చెత్త సినిమాల్లో నటించిందీ సల్మాన్ ఇప్పటికైనా తెలుసుకుంటే బెటరేమో.