Begin typing your search above and press return to search.

హోలీ వేడుకల్లో హీరోయిన్‌ కు చేదు అనుభవం

By:  Tupaki Desk   |   14 March 2017 11:00 AM GMT
హోలీ వేడుకల్లో హీరోయిన్‌ కు చేదు అనుభవం
X
అక్కినేని నాగార్జున హీరోగా చేసిన ‘ఎదురులేని మనిషి’ సినిమాలో షెహనాజ్ గుర్తుండే ఉంటుంది. ఎంటీవీ షోతో పాపులారిటీ సంపాదించుకుని.. అనుకోకుండా నాగ్ సరసన కథానాయికగా ఛాన్స్ కొట్టేసింది ఈ ముంబయి భామ. ఆ సినిమా సరిగా ఆడకపోవడం.. షెహనాజ్ కూడా మన ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోకపోవడంతో ఆమెకు మళ్లీ ఇక్కడ అవకాశాలు రాలేదు. ఆ మాటకొస్తే బాలీవుడ్లోనూ ఈమెకు పెద్దగా ఛాన్సులేమీ రాలేదు. షాహిద్ కపూర్ ‘ఇష్క్ విష్క్’ మినహా అక్కడ ఆమెకు చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేవు. ఐతే సినిమాల్లో నిరాశ ఎదురైనా టీవీ షోలు.. ప్రైవేటు కార్యక్రమాలతో అమ్మడు ఎప్పుడూ బిజీగానే ఉంటూ వస్తోంది.

కొన్నాళ్ల కిందట యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసి.. అందులో తన హాట్ హాట్ ఫొటోషూట్లకు సంబంధించిన ఫొటోలు.. వీడియోలు పెట్టడం.. ప్రాంక్ వీడియోలు షేర్ చేయడం.. ఇలా నెట్టుకొస్తోందీ భామ. తాజాగా హోలీ వేడుకల సందర్భంగా షెహనాజ్ వార్తల్లోకి వచ్చింది. హోలీ వేడుకల సందర్భంగా ఆమెతో కొందరు అబ్బాయిలు అసభ్యంగా ప్రవర్తించారట. ఆమెను ఎక్కడెక్కడో టచ్ చేసి వేధించారట. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని పంచుకుంది షెహనాజ్. హోలీ అంటే తాను ఎగ్జైట్ కాకపోవడానికి ఇది ఒక కారణమని.. ఇలా జరిగినందుకు తనకేమీ షేమ్ అనిపించట్లేదని.. తనతో అలా ప్రవర్తించిన అబ్బాయిలే సిగ్గు పడాలని అంది షెహనాజ్. హోలీ వేడుకల సందర్భంగా అమ్మాయిలతో అబ్బాయిలు ఇలా అసభ్యంగా ప్రవర్తించడం ఈ మధ్య మామూలైపోతోంది. ఒక మంచి ఉద్దేశంతో జరిగే వేడుకల్లో ఇలాంటి నెగెటివ్ యాంగిల్స్.. ఇలాంటి వేడుకల మీదే ఏహ్య భావం కలిగేలా చేస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/