Begin typing your search above and press return to search.

హైద‌రాబాదీ మిస్ ఇలా అయ్యిందేం?

By:  Tupaki Desk   |   12 Feb 2019 4:10 AM GMT
హైద‌రాబాదీ మిస్ ఇలా అయ్యిందేం?
X
`ఏ ఫిలిం బై అర‌వింద్` చిత్రంతో వెలుగులోకి వ‌చ్చింది షెర్లిన్ చోప్రా. ఆ సినిమాలో స్క్రీన్ నేమ్ గా మోనా చోప్రా అని టైటిల్స్ లో వేసారు. రిషీ- రాజీవ్ క‌న‌కాల‌- షెర్లిన్ స్టార్లుగా న‌టించ‌గా శేఖ‌ర్ సూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. రోడ్ ట్రిప్ థ్రిల్ల‌ర్ గా వ‌చ్చిన ఈ సినిమాలో షెర్లిన్ అంద‌చందాల ట్రీట్ యువ‌త‌రానికి పిచ్చిగా న‌చ్చేసింది. టాప్ మోడ‌ల్ గా షెర్లిన్ ఎక్స్ ప్రెష‌న్స్ కి ఫిదా అవ్వ‌ని వాళ్లే లేరు. అయితే ఆ సినిమాతో పేరు వ‌చ్చినా ఎందుక‌నో తెలుగులో ఆశించిన అవ‌కాశాలు రాలేదు. నిజానికి షెర్లిన్ తెలుగ‌మ్మాయి.. ప‌క్కా హైద‌రాబాదీ. 1999లో మిస్ ఆంధ్రాగా ఎంపికైంది.

మిస్ బ్యూటీ అయ్యాక మోడ‌లింగ్ లో అవ‌కాశాలొచ్చాయి. త‌ర్వాత 2002లో `వెండితెర` అనే చిత్రంతో పెద్ద‌తెర‌కు ప‌రిచ‌య‌మైంది. త‌ర్వాత త‌మిళంలో `యూనివ‌ర్శిటీ` అనే చిత్రంలో న‌టించింది. అటుపై `ఏ ఫిలిం బై అర‌వింద్` చిత్రంతో హిట్ కొట్టాక 2005లో `టైమ్ పాస్` అనే హిందీ చిత్రంలో న‌టించే అవ‌కాశం వ‌చ్చింది. దోస్తీ: ఫ్రెండ్స్ ఫ‌ర్ ఎవ‌ర్వ‌ర్(2005)- జ‌వానీ దివానీ- ఏ యూత్ ఫుల్ జోయ్ రైడ్(2006)- నాటీ బోయ్(2006)- గేమ్(2007)-ర‌ఖీబ్(2007)- రెడ్ స్వాస్తిక్(2007)- దిల్ బోలే హ‌డిప్పా(2009) త‌దిత‌ర‌ చిత్రాల్లో న‌టించింది. కెరీర్ లో 20 పైగా చిత్రాల్లో న‌టించినా పెద్ద స్టార్ మాత్రం కాలేక‌పోయింది.

బాలీవుడ్ లో త‌న ఉనికిని కాపాడుకునేందుకు షెర్లిన్ వేయ‌ని ఎత్తుగ‌డే లేదు. కానీ ఎందుక‌నో అనుకున్న‌ది మాత్రం సాధించ‌లేక‌పోయింది. ప్ర‌ఖ్యాత ప్లేబోయ్ క‌వ‌ర్ పేజీపై న‌గ్నంగా ద‌ర్శ‌న‌మిచ్చినా.. నిరంత‌రం బికినీ షూట్ల‌తో కుర్ర‌కారుకు మ‌తి చెడే ట్రీట్ ఇచ్చినా - మ్యాగ‌జైన్ల క‌వ‌ర్ ఫోటోల కోసం అడ్డు అదుపూ లేకుండా చెల‌రేగిపోయినా షెర్లిన్ కి స్టార్ డ‌మ్ అన్న‌ది అంద‌ని ద్రాక్షే అయ్యింది. ఇప్ప‌టికీ షెర్లిన్ త‌న వంతు ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉంది. అప్పుడ‌ప్పుడు టాలీవుడ్ లో ఛాన్సుల కోసం ప్ర‌య‌త్నిస్తూనే ఉంది. కానీ ఏదీ వ‌ర్క‌వుట్ అవ్వ‌డం లేదు. ప్ర‌స్తుతం త‌న వ‌యసు 35. ఏం సాధించాల‌న్నా ఇంకా ఛాన్స్ ఉంది. మ‌రి అంద‌ని ద్రాక్ష‌ను ఇప్ప‌టికైనా అందుకుంటుందో లేదో చూడాలి.