Begin typing your search above and press return to search.
హీరోయిన్స్ ను డిన్నర్ కు పిలిచారంటే అందుకే..!
By: Tupaki Desk | 29 Jan 2019 11:30 AM GMTబాలీవుడ్ హాట్ బ్యూటీ షర్లిన్ చోప్రా కొన్ని సంవత్సరాల క్రితం పలు చిత్రాల్లో నటించింది. సౌత్ లో కూడా ఈమె తన అందాలతో యూత్ లో హీట్ పుట్టించింది. ప్రస్తుతం హిందీలో పెద్దగా ఆఫర్లు లేకుండా ఉన్న షర్లిన్ చోప్రా హాట్ హాట్ ఫొటో షూట్స్ తో అప్పుడప్పుడు మీడియాలో సందడి చేస్తూ వస్తోంది. తాజాగా ఈ అమ్మడు ఒక ఇంటర్వ్యూలో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ లో కొత్తగా వచ్చే వారు లైంగిక వేదింపులను ఎదుర్కోవడం చాలా సహజం అని, తాను కూడా ఇండస్ట్రీకి కొత్తగా వచ్చినప్పుడు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లుగా చెప్పుకొచ్చింది.
ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన కొత్తలో అవకాశాల కోసం వెళ్లినప్పుడు రాత్రి డిన్నర్ పార్టీ ఉంది అంటూ పిలిచే వారని, వెళ్లకుంటే అవకాశాలు కోల్పోవాల్సి వస్తుందేమో అని వెళ్లేదాన్ని, అక్కడ ఉన్న వారు సెక్సువల్ ఫేవర్ కోరుకునే వారు. ఇండస్ట్రీలో ఇలాంటివి చాలా కామన్, ఇలాంటి ఫేవర్స్ చేస్తేనే నీకు ఫేవర్ జరుగుతుందని చెప్పేవారు. అవకాశాల కోసం కొన్ని సార్లు ఆ ఫేవర్స్ చేయక తప్పలేదని షర్లిన్ చెప్పుకొచ్చింది.
ఆఫీస్ లో రాత్రి డిన్నర్ ఏంటో అని మొదట అనుకునే దాన్ని, ఆ తర్వాత డిన్నర్ కు మరో అర్థం కూడా ఉందని, హీరోయిన్స్ ను డిన్నర్ కు పిలిచారంటే ఆ ఫేవర్ కోసమే అని తెలుసుకున్నానంది. అప్పటి నుండి కూడా బాలీవుడ్ లో నిజాయితీ పేరు కలిగిన వారి వద్దకు మాత్రమే ఆఫర్స్ కోసం వెళ్లేదాన్ని. ఇండస్ట్రీలో ఇలాంటివి చాలానే ఉంటాయి, ఇలాంటివి ధైర్యంగా ఎదుర్కొనే వారే ఇండస్ట్రీకి రావాలి. పల్లెటూర్ల నుండి వచ్చే వారిని ఎక్కువగా ఇండస్ట్రీ వారు టార్గెట్ చేస్తారని షర్లిన్ పేర్కొంది. షర్లిన్ ప్రత్యేకంగా ఎవరి పేరును ఎత్తక పోయినా బాలీవుడ్ ప్రముఖులు అంటూ పలువురిపై ఆరోపణలు చేసింది.