Begin typing your search above and press return to search.
శిల్పా శెట్టితో కుంద్రా బంధంపై షెర్లిన్ సంచలన వ్యాఖ్యలు
By: Tupaki Desk | 30 July 2021 12:30 AM GMTనీలి చిత్రాల దందాలో శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా లోగుట్టు బయటపడిన సంగతి తెలిసిందే. వీడియో యాప్ ల పేరుతో మగువలను వలలో వేసే వ్యాపారం గుట్టు రట్టయ్యింది. వందల కోట్ల బిజినెస్ గుట్టు రట్టవ్వడంతో ఇప్పుడు ఆయన వల్ల వేధింపులకు గురైన నటీమణులంతా ఒక్కొక్కరుగా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కొందరు పోలీస్ కేసులు పెడుతున్నారు.
ఇక రాజ్ కుంద్రాతో ఇలాంటి వ్యవహారంలో తేడాలు రావడంతో గత ఏప్రిల్ లో షెర్లిన్ అతడిపై పోలీస్ కేసును పెట్టింది. ప్రస్తుతం ఇంకా ఆ కేసు విచారణ సాగుతోంది. ఓ బిజినెస్ డీల్ మాట్లాడే విషయమై తన ఇంటికే వచ్చిన రాజ్ కుంద్రా తనపై బలాత్కారానికి పాల్పడ్డాడని బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడని షెర్లిన్ ఆరోపించింది. శిల్పాశెట్టితో తన బంధం సంక్లిష్టంగా మారిందని రాజ్ కుంద్రా తనతో అన్నట్టు షెర్లిన్ ఈ సందర్భంగా వెల్లడించింది.
కానీ తాను పెళ్లయినవాడితో సంబంధం కొనసాగించే ఆలోచనలో లేనని అలాగే బిజినెస్ కోసం అలా చేయకూడదనుకున్నానని తెలిపారు. తనని బలవంతంగా ముద్దు పెట్టుకోబోతుంటే తాను భయపడి వాష్ రూమ్ కి పారిపోయానని కూడా షెర్లిన్ వ్యాఖ్యానించారు.
ఈ కేసులో షెర్లిన్ చోప్రాకు ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు సోమవారం సమన్లు జారీ చేశారు. అనంతరం రాజ్ కుంద్రాపై మరోసారి షెర్లిన్ తీవ్ర ఆరోపణలు చేసింది. 2019లో రాజ్ కుంద్రా తన బిజినెస్ మెనేజర్ కు కాల్ చేసి ఒక డీల్ మాట్లాడారట. 2019 మార్చి 27న బిజినెస్ మీటింగ్ తరువాత రాజ్ కుంద్రా ఓ రోజు తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఇంటికి వచ్చారు. ఓ సంక్షిప్త సందేశానికి సంబంధించిన వాదనలో అతడు ఇంటికి వచ్చి తప్పుడుగా ప్రవర్తించాడని తెలిపింది. శిల్పా శెల్లి వల్ల రాజ్ కుంద్రా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నట్టు తనతో అన్నాడని .. తమ బంధం సరిగా లేదని చెప్పాడని షెర్లిన్ వ్యాఖ్యానించడంతో ఇప్పుడు ఆ దిశగానూ చర్చ మొదలైంది. ఈ కేసు పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉండనున్నాయని కూడా అర్థమవుతోంది.